బిజినెస్

సౌరశక్తి పరికరాల వాణిజ్య సమస్యలపై డబ్ల్యూటీవో కమిటీ తీర్పుపై అమెరికా సవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: సంప్రదాయేతర ఇంధన వనరులు (సౌర శక్తి) పరికరాల దిగుమతి సమస్యలపై ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యూటీవో)కు చెందిన వివాదాల పరిష్కార కమిటీ భారత్‌కు అనుకూలంగా ఇచ్చిన తీర్పును అమెరికా సవాల్ చేసింది. డబ్ల్యూటీవోకు చెందిన మరో ఉన్నత స్థాయి కమిటీకి అమెరికా తన పిటిషన్‌ను శుక్రవారం సమర్పించింది. అమెరికాకు చెందిన ఎనిమిది రాష్ట్రాలు సమకూరుస్తున్న సాంప్రదాయేతర ఇంధన వనరుల దేశీయ కంటెంట్ అవసరాలు, సబ్సిడీలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయన్న భారత్ ఆరోపణలకు ఊతమిస్తూ మనదేశానికి అనుకూలంగా గత జూన్‌లో డబ్ల్యుటీవో వివాదాల పరిష్కార కమిటీ తీర్పునిచ్చింది. ఈక్రమంలో తాజాగా అమెరికా ఆ తీర్పును సవాల్‌చేస్తూ డబ్ల్యుటీవో అత్యున్నత స్థాయి అప్పిలేట్ కమిటీకి పిటిషన్ సమర్పించింది. గత తీర్పునకు సంబంధించిన నివేదికలో తమ దేశానికి చెందిన పూర్తి స్థాయి సమస్యలను పరిగణనలోకి తీసుకోలేదని అమెరికా వాదిస్తోంది. ప్రధానంగా గత తీర్పు సందర్భంగా డబ్ల్యూటీవో వివాద పరిష్కారాల కమిటీ ‘జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్’ (గాట్) ఒప్పందం మేరకు అమెరికా సదుపాయాలు లేవ’ని పేర్కొనడం జరిగింది. ప్రత్యేకంగా సుంకాల వంటి వాణిజ్య వివాదాలు పరిష్కారానికి సంబంధించిన ‘గాట్’ నిబంధనలను అన్ని దేశాలూ పాటించాల్సి ఉంటుంది. ఈక్రమంలో 2016 సెప్టెంబర్‌లో అమెరికాతో తలెత్తిన సౌరశక్తి పరికరాల దిగుమతికి సంబందించిన వివాద పరిష్కారానికి భారత్ డబ్ల్యుటీవో వివాద పరిష్కారాల కమిటీని ఆశ్రయించింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వాషింగ్టన్, కాలిఫోర్నియా, మోంటనా, మస్సాచుసెట్స్, కనె్నక్టికట్, మిచిగాన్, దిలావరే, మినె్నసోటా రాష్ట్రాలు సాంప్రదాయేతర ఇంధన వనరుల పరికరాల వాణిజ్యానికి సబ్సిడీలు ఇస్తున్నాయి. ఐతే ఈ సదుపాయాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా లేవని భారత్ పిర్యాదు చేసింది. దిగుమతులకు ఆ దేశం అందజేస్తున్న ప్రోత్సాహకాలు అతి స్వల్ప స్థాయిలో ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో వచ్చిన తీర్పును జనీవాలోని ప్రత్యేక కమిటీ వద్ద అమెరికా సవాల్ చేసింది. దీనిపై ఒకవేళ భారత్‌కు వ్యతిరేకంగా తీర్పువస్తే మరో ఆరేడు నెలల్లో దీనిపై కౌంటర్ దాఖలు చేసే అవకాశం భారత్‌కు ఉంటుంది.