బిజినెస్

బ్రహ్మణీలో చైనా బృందం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మలమడుగు, ఆగస్టు 16: కడప జిల్లా జమ్మలమడుగు మండలం అంబవరం వద్ద ఉన్న బ్రహ్మణీ పరిశ్రమను శుక్రవారం చైనాకు చెందిన థెయాంగ్ హోల్డింగ్స్ కంపెనీ ప్రతినిథుల బృందం పరిశీలించింది. నలుగురు సభ్యుల బృందం బ్ర హ్మణీ పరిశ్రమలో పర్యటించింది. బ్రహ్మణీ కా ర్యాలయంలో ఆర్డీవో నాగన్న, జిల్లా అధికారులు ప్రతినిథుల బృందానికి బ్రహ్మణీకి సంబంధించిన పలు వివరాలను వివరించారు. బ్రహ్మణీ పరిశ్రమకు కేటాయించిన భూములు, నీటి వనరులు, ముడిసరుకు, రవాణా, విద్యుత్, ఇతర అనుమతుల వివరాలను బ్రహ్మణీ పరిశ్రమలో పర్యటించి చేపట్టిన నిర్మాణాలను పరిశీలించింది. అనంతరం నీటి వనరులు ఉ న్న మైలవరం జలాశయం బ్యాక్ వాట ర్ ప్రాం తాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించింది. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన వసతులు, సౌకర్యాలు వంటి వాటి వివరాలను విదే శీ బృందం అధికారులను అడిగి వివరాలు సేకరించింది. అనంతరం చైనా బృందం కడపకు వెళ్లిపోయింది.