బిజినెస్

54 బొగ్గు గని ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ప్రభుత్వ నిర్వహణలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)కు చెందిన 54 బొగ్గు గనుల ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం చేసుకుంటోంది. కాంట్రాక్టుల పరంగా, హరిత క్లియరెన్సుల పరంగా ఇబ్బందులు తలెత్తడమే ఇందుకు ప్రధాన కారణమని ఈ ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గుగనుల సంస్థ వెల్లడించింది. రూ. 20 కోట్లు లేదా అంతకుమించిన పెట్టుబడులతో కూడిన మొత్తం 120 బొగ్గుగని ప్రాజెక్టుల స్థాపన ప్రస్తుతం వివిధ దశల్లో ఉండగా ఇందులో 66 ప్రాజెక్టుల స్ధాపన దాదాపుగా పూర్తికావచ్చింది. మరో 54 ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవుతోందని సీఐఎల్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. పర్యావరణ, అటవీ క్లియరెన్స్‌లు, స్థల సేకరణ, పునరావాసం, పునఃస్థిరీకరణ, కాంట్రాక్టు సమస్యలు తలెత్తడం వల్లే ఈ ప్రాజక్టుల అమలులో జాప్యం తలెత్తుతోందని సీఐఎల్ తెలిపింది. 2018-19లో మొత్తం రూ. 989.43 కోట్ల విలువైన బొగ్గుగని ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని వివరించింది. ఆ సంవత్సరంలోనే రూ. 1,502.65 కోట్ల విలువైన రెండు భారీ బొగ్గు ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. అలాగే రూ. 11,807.78 కోట్ల పెట్టుబడులతో కూడిన 20 ప్రాజెక్టుల నిర్మాణానికి గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ అనుమతులు వచ్చాయి. ‘విజన్ 2030’ లక్ష్యం మేరకు బొగ్గు ఉత్పత్తులను పెంచే లక్ష్యంతో 80 శాతం దేశీయంగా ఉత్పత్తులు జరిగేలా కోల్ ఇండియా చర్యలు చేపడుతోంది. ఇందుకు సంబంధించి మధ్య, దీర్ఘకాలిక దృక్పథంతో కూడిన ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. 2030-31 వరకు అవసరాలను దృష్టిలో ఈ ప్రణాళిక అమలవుతుంది. ఇది అమలైతే 2024-25 నుంచి 7.6 శాతం వంతున ప్రతిఏటా ఉత్పత్తులు పెరిగి సీఐఎల్‌తోబాటు ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. ఈక్రమంలో భారీ ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలను సీఐఎల్ తెలుసుకుని వాటిని చక్కదిద్దేందకు ఉపక్రమించింది.