బిజినెస్

జీఎస్‌టీ వసూళ్లలో ఈశాన్య రాష్ట్రాలదే పైచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 15: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లలో ఈశాన్య రాష్ట్రాలు 30 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తొలి నాలుగు నెలల కాలానికి సంబంధించిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. అత్యధిక తయారీ వ్యవస్థతో కూడిన పలు ప్రముఖ రాష్ట్రాల జీఎస్‌టీ వసూళ్ల వృద్ధితో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాలదే పైచేయిగా ఉంది. ఇందులో 9 రాష్ట్రాల వసూళ్లు జాతీయ కనీస స్థాయి 9 శాతం కంటే మూడురెట్లు అధికంగా ఉన్నాయి. నిజానికి గడచిన ఏప్రిల్ నుంచి జూలై వరకు దేశంలో మొత్తం పన్ను వసూళ్లు రూ. 3.56 లక్షల కోట్లు జరిగాయి. ఇందులో ఈశాన్య రాష్టమ్రైన నాగాల్యాండ్ 39 శాతం వృద్ధితో రూ. 393 కోట్లు వసూలు చేసి అగ్ర స్థానంలో నిలిచింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ 35 శాతం వృద్ధితో రూ. 514 కోట్లు వసూలు చేసి రెండో స్థానంలో నిలిచింది. 32 శాతం వృద్థితో రూ.370 కోట్లు వసూలు చేసిన సిక్కిం మూడో స్థానాన్ని ఆక్రమించింది. అలాగే మేఘాలయ 30 శాతం వృద్ధితో రూ. 680 కోట్లు, మిజోరాం 27 శాతం వృద్ధితో రూ. 350 కోట్లు వసూలు చేశాయి. అతి చిన్న రాష్ట్రాలైన త్రిపుర, మణిపూర్ సైతం జీఎస్‌టీ వసూళ్లలో దాదాపు 16 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అతిపెద్ద పారిశ్రామిక రాష్ట్రాలైన మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్ కంటే ఈశాన్య రాష్ట్రాల వసూళ్లలో ద్విగుణీకృత వృద్ధిరేటు నమోదవడం విశేషం. మొత్తం 37 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ, లక్ష్యద్వీప్, పుదుచ్చేరి కనీస స్థాయికంటే 2, 17, 8 శాతం తక్కువగా జీఎస్‌టీ వసూళ్లు చేశాయని గణాంకాలు చెబుతున్నాయి. డిల్లీ వసూళ్లు గడచిన ఏడాది జరిగిన 13వేల కోట్లకంటే తక్కువగా రూ. 12,700 కోట్లు జరిగాయి. కేంద్ర అమ్మకపు పన్ను (సీఎస్‌టీ) ఆర్బిటరేజ్ ముగిసి పోవడంతోనే ఢిల్లీలో జీఎస్‌టీ వసూళ్లు తగ్గాయని వాణిజ్య రంగ నిపుణులు భావిస్తున్నారు. గతంలో ఢిల్లీకి అతి తక్కువ (ఒక శాతం) సీఎస్‌టీ ఒక శాతం అమలయ్యేది. అందువల్ల పలు కంపెనీలు ఈ కేంద్ర పాలిత ప్రాంతం నుంచే ఎగుమతులు చేసుకునేందుకు వీలుగా తమ కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాగా అతిపెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్ జీఎస్‌టీ వసూళ్లలో కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమై 6 శాతం వృద్ధినే నమోదు చేశాయి. అలాగే పంజాబ్ 7 శాతం, హర్యానా 9 శాతం వృద్ధిని నమోదు చేయగా, తమిళ్‌నాడు, కర్నాటక 10, 11 శాతాల వృద్ధిని నమోదు చేయడం జరిగింది. ఒక రకంగా ఉత్పత్తులు జరిగే అతిపెద్ద పారిశ్రామిక రాష్ట్రాలకంటే ఈ విషయంలో వినిమయ రాష్ట్రాలైన బీహార్, ఒడిషా, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ కొంత మెరుగైన పనితీరును కనబరిచినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.