బిజినెస్

జీవిత బీమా సంస్థల కొత్త ప్రీమియం ఆదాయం 6 శాతం వృద్థి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 15: జీవిత బీమా సంస్థలకు కొత్త ప్రీమియం ద్వారా గడచిన జూలై నెల ఆదాయం 6 శాతం పెరిగింది. ఆ నెలలో మొత్తం రూ. 21,509.25 కోట్ల ఆదాయం సమకూరిందని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అధారిటీ (ఇక్రా) గణాంకాల మేరకు వెల్లడైంది. దేశంలోని మొత్తం 24 జీవిత బీమా సంస్థలు 2018 జూలైలో రూ. 20,219.26 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం జరిగింది. అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ రికార్డు స్థాయిలో 3.10 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. జూలైలో కొత్త ప్రీమియం ద్వారా మొత్తం 15,311.87 కోట్ల రూపాయలు ఎల్‌ఐసీ ఆర్జించింది. ఈ సంస్థ గత ఏడాది ఇదే కాలంలో రూ. 14,851.77 కోట్లు ఆర్జించింది. మిగిలిన ప్రైవేటు రంగ బీమా సంస్థలన్నీ రూ. 6,197.37 కోట్లు ఆర్జించాయి. ఈ ఆదాయం సైతం గత ఏడాది జూలైతో పోలిస్తే 15 శాతం అధికం. ఆ సంస్థల సంఘం ‘ఇర్డాయ్’ ఈ గణాంకాలను వెల్లడించింది. కాగా ప్రధాన ప్రైవేటు బీమా సంస్థల్లో హెచ్‌డీఎఫ్‌సీ కొత్త ప్రీమియం ఆదాయం అత్యదికంగా 26 శాతం వృద్ధిచెంది జూలైలో రూ. 1,402,81 కోట్లు సమకూరింది. ఇక ప్రభుత్వ రంగ బీమాల్లో ఎస్‌బీఐ లైఫ్ 8 శాతం వృద్ధితో రూ. 1,402.81 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. మాక్స్ లైఫ్ 38.3 శాతం వృద్ధితో రూ. 444.76 శాతం, ఆదిత్యబిర్లా సన్‌లైఫ్ 27 శాతం వృద్ధితో రూ. 267 కోట్లు, కోటక్ మహీంద్రా లైఫ్ 22 శాతం వృద్ధితో రూ. 355 కోట్లు, టాటా ఏఐఏ లైఫ్ 75 శాతం వృద్ధితో రూ. 241.34 కోట్లు ఆర్జించాయి. కాగా డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రామెరికా లైఫ్ కొత్త ప్రీమియం ఆదాయం మాత్రం సుమారు 64 శాతం పతనమై కేవలం రూ. 52.20 కోట్లు మాత్రమే సమకూరింది. ఇక కెనరా హెచ్‌ఎస్‌బీసీ ఓబీసీ లైఫ్ సైతం 24 శాతం పతనమై రూ.92 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఆదాయం కూడా 15 శాతం నష్టపోయి రూ. 48 కోట్లకే పరిమితమైంది. కాగా స్థూలంగా గడచిన ఏప్రిల్ నుంచి జూలై వరకు 24 బీమా కంపెనీల ఆదాయంలో 44.25 శాతం వృద్ధి నమోదై మొత్తం ఆదాయం రూ. 82,146.47 కోట్లకు చేరింది. కాగా ఎల్‌ఐసీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల వ్యవధిలో కొత్త ప్రీమియం ద్వారా 52 శాతం అదనపు ఆదాయన్ని రూ. 60,106.66 కోట్ల మొత్తాన్ని ఆర్జించింది. మిగిలిన ప్రైవేటు రంగ ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ స్థూలంగా 27 శాతం వృద్ధితో రూ. 22,039.81 కోట్ల మొత్తాన్ని ఆర్జించాయి.