బిజినెస్

అన్ని విభాగాల్లో పైచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: గత ఐదేళ్ల చరిత్రలో సింగరేణి అన్ని విభాగాల్లో పైచేయి సాధించిందని సింగరేణి సీఎండీ శ్రీధర్ అన్నారు. గురువారం హైదరాబాద్ సింగరేణి భవనంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 25.822 కోట్ల టర్నోవర్ సాధించడంతో పాటు రూ. 1766 కోట్ల లాభాలను కూడా ఆర్జించిందన్నారు. మరో ఐదేళ్లలో 50 వేల కోట్ల టర్నోవర్ సాధించి, రూ. 4వేల కోట్ల లాభాలు వచ్చే విధంగా ప్రణాళికలను రూపొందించాలని బోర్డ్ డైరెక్టర్లు, ఏరియా మేనేజర్లకు సూచించారు. ఒడిశాలో ప్రస్తుతం చేపట్టిన నైనీ బొగ్గు బ్లాక్‌తో పాటు మరికొన్ని బ్లాక్‌లను పొందడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. జార్ఖంఢ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ బొగ్గు బ్లాకులను పొందడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. దేశంలో మైనింగ్ రారాజు మహారత్న కంపెనీలకు సింగరేణిని దీటుగా ముందుకు తీసుకుపోతున్నామన్నారు. బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి ద్వారా సింగరేణిని దేశంలో నెంబర్ -1 స్థానంలో ఉండే విధంగా కొనసాగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
చిత్రం...స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సంస్థ సీఎండీ శ్రీధర్