బిజినెస్

10 శాతం లాభపడిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) వాటాలు మంగళవారం భారీ స్ధాయిలో 10 శాతం లాభపడ్డాయి. రూ. 71,638 కోట్ల రూపాయల అదనపుమార్కెట్ విలువను ఆ కంపెనీ సంతరించుకుంది. వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ కంపెనీ పెట్టుబడిదారులకు అనువైన నిర్ణయాలు తీసుకోవడమే ఇందుకు కారణమని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు. తాజా దూకుడుతో ఈ బీఎస్‌ఈలో ఆర్‌ఐఎల్ వాటాలు 9.72 శాతం ఎగబాకి ఒక్కోవాటా రూ. 1,275 వంతున ట్రేడైంది. ఒక దశలో ఈ వాటాల విలువ ఒక్కసారిగా 12.09 శాతం లాభపడి ఒక్కో వాటా ధర రూ.1,302.50కు చేరింది. ఈ క్రమంలో బీఎస్‌ఈలో కంపెనీ మార్కెట్ విలువ రూ. 8,08,233.78 కోట్ల నుంచి ఒక్కసారిగా రూ. 71,637.78 కోట్లకు చేరుకుంది. ఇక వాణిజ్య విలువ పరిమాణాన్ని చూస్తే బీఎస్‌ఈలో మొత్తం 20.92 లక్షల వాటాలు మంగళవారం ట్రేడయ్యాయి. అలాగే ఎన్‌ఎస్‌ఈలో 4.79 కోట్ల వాటాలు ట్రేడయ్యాయి. ‘త్వరలో రిలయన్స్ వాటా ఒక్కోటి రూ. 13,00కు చేరుకుంటుందని కంపెనీ పరిశోధన, కేపిటల్ ఎయిమ్ విభాగం అధిపతి రమేష్ తివారీ ధీమా వ్యక్తం చేశారు. యాజమాన్య ట్రాక్ రికార్డు, డిజటల్ మార్కెట్‌లో ప్రగతి ఇందుకు దోహదం చేస్తాయన్నారు. రిలయన్స్ తాజా ప్రకటనలు సరికొత్త కొనుగోలు వైఖరిని పాదుకొల్పుతాయని వచ్చే 12 నెలల వ్యవధిలోనే రూ. 2000 స్థాయికి వాటాల విలువ చేరుకోవడం ఖాయమని ఆయన అన్నారు. కాగా సోమవారం నాడు కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ పలు ఆసక్తికర ప్రకటనలు చేశారు. అందులో చమురు, రసాయనాల సంస్థల వాణిజ్య విభాగ వాటాలను 20 శాతం సౌదీకి చెందిన ‘ఆరామ్‌కో’ కంపెనీకి విక్రయించడం ఇందులో ఒకటి. ఈమేరకు రోజుకు 1.36 కోట్ల మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తున్న గుజరాత్ జామ్‌నగర్ రీఫైనింగ్ కాంపెక్స్‌కు చెందిన 20 శాతం వాటాలు సౌదీ కంపెనీకి వెళతాయి. దీని విలువ దాదాపు 75 బిలియన్ డాలర్లు. అలాగే ఆర్‌ఐఎల్‌కు చెందిన 1,400 పెట్రోల్ బంక్‌ల్లో 49 శాతం వాటాలను భారత్ పెట్రోలియం (బీపీ) హస్తగతం చేసుకోనుంది. అంతేకాకుండా ఆర్‌ఐఎల్‌కు ప్రస్తుతం దేశంలోని 31 విమానాశ్రయాల్లో ఉన్న పెట్రోల్ విక్రయ సదుపాయ కేంద్రాలను సైతం రూ. 7వేల కోట్లకు బీపీ సొంతం చేసుకోనుంది. 2021 మార్చి నాటికి తమ కంపెనీని పూర్తిగా అప్పులు లేని సంస్థగా మార్చాలన్న లక్ష్యం ఉందని ఆర్‌ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలోప్రకటించడం జరిగింది.