బిజినెస్

రిలయన్స్ మరో సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న రిలయన్స్ సంస్థ దేశ ప్రజలకు మరింత అద్భుతమైన సేవలను అందించబోతోంది. వచ్చే నెల 5వ తేదీ నుంచి జియో గిగా ఫైబర్ సేవలను అందుబాటులోకి తెస్తామని సోమవారం ఇక్కడ జరిగిన 42వ ఏజీఎం సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. గిగా ఫైబర్ ద్వారా ల్యాండ్ లైన్ ఫోన్లనుంచి ఉచితంగా వాయిస్ కాల్స్ చేసుకునేందుకు వీలుంటుంది. 100 ఎంబీపీఎస్ కనీస స్పీడుతో హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ అందుబాటులోకి వస్తుంది. అలాగే టెలివిజన్‌లోనూ మరింత నాణ్యతను గిగా ఫైబర్ సేవలు తీసుకువస్తాయి. ఇవన్నీ కూడా నెలకు కేవలం రూ.700కే అందుబాటులోకి రానున్నట్లు అంబానీ ప్రకటించారు. జియో ల్యాండ్‌లైన్ ద్వారా నెలకు రూ.500 ఫిక్స్‌డ్ రెంటల్‌తో అమెరికా, కెనడా వంటి దేశాలకు పరిమితి లేని ఐఎస్‌డీ కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. భారతదేశంలో అత్యంత వౌలికమైన జియో గిగా ఫైబర్ 100 ఎంబీపీఎస్‌తో మొదలవుతుందని వెల్లడించిన అంబానీ.. త్వరలోనే ఒక జీబీపీఎస్ లక్ష్యం దిశగా ముందుకు వెళ్తామని చెప్పారు. దేశంలోని ప్రతి ఇంటికీ జియో ఫైబర్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు.
ప్రపంచంలో ఈ సేవలు అందించే సంస్థలు వసూలు చేస్తున్న రేట్లలో పదోవంతు రేట్లకే వీటిని అందిస్తామని తెలిపారు. ఈ నెలవారీ రెంటల్ ప్రణాళిక రూ.700తో మొదలవుతుందని.. అది 10వేల వరకు పెరిగే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. 2020 మధ్య కాలం నుంచి ప్రీమియం జియో గిగా ఫైబర్ వినియోగదారులు కొత్త సినిమాలను విడుదలైన రోజే చూసే అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇంటినుంచే వీటిని తిలకించవచ్చునని, థియేటర్‌లో తొలిరోజు సినిమా చూసిన అనుభూతిని ఇంటి నుంచే అదే రోజు చూసి పొందవచ్చునని అంబానీ తెలిపారు.
18 నెలల్లో రుణ రహిత రిలయన్స్
రానున్న 18 నెలల కాలంలో రిలయన్స్ గ్రూపును రుణ రహితంగా మారుస్తామని ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఇందులో భాగంగా చమురు, రసాయన వ్యాపార సంస్థల్లో తనకున్న వాటాలను సౌదీ కంపెనీ ఆరామ్‌కు విక్రయిస్తున్నామని.. అలాగే ఇంధన రిటైలింగ్ కంపెనీ బీపీలోని వాటాలను విక్రయిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ రెండు సంస్థలతో ఇందుకు సంబంధించిన వ్యవహారాన్ని పూర్తి చేసుకుంటామని, వీటివల్ల తమకు 1.15 లక్షల కోట్ల రూపాయలు అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు.
చిత్రాలు.. .42వ ఏజీఎం సమావేశానికి తల్లి కోకిలాబెన్ అంబానీ, భార్య నీతా అంబానీతో కలిసి హాజరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ , ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ