బిజినెస్

రెండోరోజూ లాభాల పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 9: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజైన శుక్రవారం సైతం లాభాల బాటలో నడిచాయి. ప్రధానంగా దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చే చర్యలు కేంద్రం చేపట్టడం, అలాగే పెట్టుబడిదారులకు పన్నులపరంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు కసరత్తు చేస్తుండటం సానుకూలంగా మారాయి. ఇంట్రాడేలో ఏకంగా 480 పాయింట్లు ఎగబాకిన బీఎస్‌ఈ 30షేర్ల సూచీ సెనె్సక్స్ చివరిగా 254.55 పాయింట్ల ఆధిక్యతతో 0.68 శాతం లాభాలతో 37,581.91 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 77.20 పాయింట్ల ఆధిక్యతతో 11,109.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. మొత్తం ఈ వాణిజ్య వారంలో సెనె్సక్స్ 463.69 పాయింట్లు లేదా 1.02 శాతం లాభపడింది. విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడిక్కడ సమావేశమయ్యారు. అలాగే పరిశ్రమలకు చెందిన ప్రముఖులతో సైతం నిర్మల, ఆమె మంత్రిత్వ శాఖ అధికారులు గురువారం సమావేశమై చర్చించడం జరిగింది. ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో పెట్టుబడిదారులపై విధించిన అత్యధిక సర్‌చార్జీలను తొలగిస్తారన్న వార్తల నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేందు కు చేపట్టాల్సిన చర్యల విషయమై ఈ సందర్భంగా ప్రభుత్వానికి పలు సూచనలు, సలహాలు అందినట్టు తెలిసింది. ఈక్రమంలో బహుళ ప్రయోజనాత్మకంగా వివిధ చర్యలు చేపటేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధానంగా పన్నుల విషయంలో సరళీకృత విధానాన్ని అనుసరించనున్నారన్న వార్తలతో దేశీయ స్టాక్ మార్కెట్లకు గత రెండు రోజులుగా ఊతం లభించింది. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో శుక్రవారం మారుతి, బజాజ్ ఫైనాన్స్, వేదాంత, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్, హెచ్‌యూఎల్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ అత్యధికంగా 3.36 శాతం లాభాలను సంతరించుకున్నాయి. మరోవైపు ఎస్‌బ్యాంక్ అత్యధికంగా 7.91 శాతం నష్టపోయింది. టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, టాటాస్టీల్, ఐటీసీ, సన్‌పార్మా దాదాపు 2.50 శాతం నష్టపోయాయి. ఐటీ వంటి కొన్ని స్టాక్స్‌లో మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఐనా సూచీల పరుగు లాభాల వైపే సాగింది. ఐతే రాబోయే రోజుల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతుందని చెప్పలేమని ప్రముఖ విశే్లషకుడు వినోద్ నాయర్ ఆభిప్రాయపడ్డారు. ప్రధానంగా పన్నులపై ఊహించిన ఫలితాలు వస్తాయా లేదా, ద్రవ్య లభ్యతకు అనుగుణంగా చేపట్టిన రెపోరేట్ల వల్ల వడ్డీరేట్లు తక్కుముఖం పడతాయా లేదా అన్న విషయాలపై మార్కెట్ల స్థితిగతులు ఆధారపడి ఉంటాయని, ఇవన్నీ కార్యరూపం దాల్చితే ఈ ఏడాది ద్వితీయార్థం నుంచే దేశం ఆర్థిక స్థితి మెరుగవుతుందని నాయర్ తెలిపారు. కాగా రంగాల వారీగా చూస్తే బీఎస్‌ఈలో వాహన, ఫైనాన్స్, వినిమయ వస్తువులు, బ్యాంకెక్స్, స్థిరాస్తి, ఎఫ్‌ఎమ్‌సీజీ సూచీలు 1.99 శాతం లాభపడ్డాయి. మరోవైపు లోహ, టెక్, టెలికాం, ఐటీ, విద్యుత్, హెల్త్‌కేర్ 0.83 శాతం నష్టపోయాయి. బ్రాడర్ బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక శాతం వృద్ధిని నమోదు చేశాయి.
మిశ్రమ ఫలితాలతో విదేశీ మార్కెట్లు
అమెరికాతో వివిధ దేశాలకున్న వాణిజ్య వివాదాలు ముదరడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో శుక్రవారం సైతం స్తబ్ధత నెలకొంది. ఆసియాలో షాంఘై కాంపోజిట్ సూచీ, హ్యాంగ్‌సెంగ్, కోస్పి, నిక్కీ మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాలను నమోదు చేశాయి. కాగా అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ శుక్రవారం 12పైసలు నష్టపోయి ఇంట్రాడేలో రూ. 70.81గా ట్రేడైంది. ముడిచమురు ధరలు మాత్రం 0.73 శాతం పెరిగి బ్యారెల్ 57.80 డాలర్ల వంతున ట్రేడైంది.