బిజినెస్

తగ్గిన వెండి, బంగారం ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: దేశీయ విఫణిలో బంగారం ధరలు శుక్రవారం తగ్గుముఖం పట్టాయి. రికార్డు స్థాయి గరిష్ట ధరలను అందుకున్న ఒక్క రోజు వ్యవధిలో వరలక్ష్మీ వ్రతం రోజున ఈ మార్పు చోటుచేసుకోవడం విశేషం. దేశ రాజధానిలో 10 గ్రాములు (తులం) బంగారంపై రూ. 140 తగ్గింది. అయినప్పటికీ రూ. 38,000 స్థాయిని మించే 38,330గా ట్రేడైంది. కాగా ఆభరణాల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడం వల్లే ఇలా ధర తగ్గిందని వ్యాపార వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు ఔన్సు 1,500 డాలర్ల సెంటిమెంటు స్థాయి వద్ద స్థిరంగా కొనసాగుతూ, పలు విదేశీ మార్కెట్లలో లాభాలు పండిస్తోంది. ఇందువల్ల దేశీయ మార్కెట్లలో ధరలు తగ్గాయని అంటున్నారు. కాగా వెండి ధరలు సైతం శుక్రవారం కిలోపై రూ. 290 తగ్గి మొత్తం ధర రూ. 44,010గా ట్రేడైంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లు రెండు రోజులుగా లాభదాయకంగా మారడంతో మదుపర్లు ఆ వైపు దృష్టిమళ్లించడం వల్ల కూడా ఇలా వెండి, బంగారం ధరలు తగ్గాయని మార్కెట్ విశే్లషకులు పేర్కొంటున్నారు.
ఇలావుండగా అంతర్జాతీయంగా న్యూయార్క్‌లో ఔన్సు బంగారం 1,504 డాలర్ల గరిష్ట స్థాయిలో ట్రేడవుంతోంది. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలు, ఆర్థిక వృద్ధిరేటు మందగమనం వంటి అంశాలతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల స్థితి ఆశాజనకంగా లేకపోవంతో మదుపర్లు అక్కడ బంగారంపై దృష్టి మళ్లించారని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. అలాగే ఆ మార్కెట్‌లో ఔన్సు వెండి ధర సైతం 17.12 డాలర్ల గరిష్ట స్థాయికి చేరింది. ఇలావుండగా దేశ రాజధానిలో రూ. 140లు తగ్గి 99.9 శాతం స్వచ్ఛ బంగారం 10 గ్రాములు రూ. 38,330గాను, 99.5 శాతం స్వచ్ఛ బంగారం రూ. 38.160గాను ట్రేడయ్యాయి. ఇక సవరం (ఎనిమిది గ్రాములు) బంగారం ధరల్లో పెద్దగా హెచ్చుతగ్గులు చోటుచేసుకోకుండా రూ. 28,500 పలికింది. కాగా గురువారం నాడు ఆల్‌టైం రికార్డు స్థాయికి బంగారం ధరలు చేరుకున్నాయి. 10 గ్రాములు రూ. 38,470 ధర పలికింది. గడచిన రెండు రోజులుగా బంగారం ధరలు రూ. 1,663 పెరిగాయి. కాగా దేశ రాజధానిలో వెండి ధరలు కిలోపై రూ. 290 తగ్గి మొత్తం 43,065 వంతున పలికాయి. వార సరఫరా విధానంలో రూ. 665 తగ్గి రూ. 43,065 పలికింది. అలాగే వెండి నాణేలు వంద పీసులపై వెయ్యి రూపాయలు పెరిగి కొనుగోళ్లలో రూ. 88,00, అమ్మకాల్లో రూ. 89000 వంతున ట్రేడయ్యాయి.