బిజినెస్

భారతి టెలికం’లో వాటాలను పెంచుకునేందుకు ‘సింగ్‌టెల్’ సుముఖత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఎయిర్‌టెల్‌లో అంతర్భాగమైన భారతి టెలికాంలో పెట్టుబడుల వాటాను పెంచుకునేందుకు సింగపూర్‌కు చెందిన టెలికం దిగ్గజం ‘సింగ్‌టెల్’ సంసిద్ధతను వ్యక్తం చేస్తోం ది. దేశంలో మొత్తం టెలికాం మార్కెట్లో 50 శాతానికి మించిన భాగస్వామ్యం ఉన్న ఎయిర్‌టెల్‌లో ప్రాముఖ్యతను పెంచుకునే దిశగా సింగ్‌టెల్ కృషి చేస్తోంది. ప్రస్తుతం భారతి ఎయిర్‌టెల్‌లో 41 శాతం వాటాలు ‘్భరతి టెలికాం’కు ఉన్నాయి. సునిల్ భారతి మిట్టల్ ఆయన కుటుంబీకులకు భారతి ఎయిర్‌టెల్‌లో 52 శాతం వాటాలున్నాయి. కాగా రుణ భారాన్ని తగ్గించుకునే దిశగా చర్యలు చేపట్టిన భారతి టెలికం లిమిటెడ్ ప్రస్తుతం ప్రమోటర్ గ్రూప్‌లో ఉన్న కొంత శాతం వాటాను వెనక్కు తీసుకునే అవకాశాలున్నా యి. ఈ క్రమంలో ఏర్పడే ఖాళీని భర్తీ చేయాలని సింగ్‌టెల్ ప్రయత్నాలు సాగిస్తోంది. దీంతో విదేశీ కంపెనీ వాటాలు 50 శాతానికి మంచితే ఈ కంపెనీ పూర్తిగా విదేశీ కంపెనీ నిర్వహణలోని సంస్థ గా మారుతుంది. ఇదే జరిగితే భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్‌లోని భారతీ టెలికాంకు చెందిన వాటాలన్నీ విదేశీ వాటాల కింద మారిపోతాయని ఓ విలేఖరి ఈ మెయిల్ ద్వారా అడిగిన ప్రశ్నకు ఎయిర్‌టెల్ సమాధానంలో స్పష్టం చేసింది. ప్రస్తుతం భారతి ఎయిర్‌టెల్‌లో విదేశీ వాటాలు 43 శాతంగా ఉన్నాయి. ఐతే ప్రస్తుతం సింగ్‌టెల్ చేస్తున్న ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే విదేశీ పెట్టుబడులు 85 శాతానికి చేరుకుంటాయి. కాగా ఈ తాజా ప్రతిపాదల క్రమంలో రెండోసారి భారతీ ఎయిర్‌టెల్ తమ సంస్థలో 100 శా తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించాల్సిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ దరఖాస్తు చేసుకుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇటీవల ఈ కంపెనీ చేసిన ఎఫ్‌డీఐ దరఖాస్తును కేంద్ర టెలికాం శాఖ తిరస్కరించింది. విదేశీ పెట్టుబడులకు సం బంధించిన వివరాల్లో స్పష్టత లేకపోవడం వల్ల ఆ దరఖాస్తు తిరస్కరణకు గురైంది. కాగా భారతి ఎయిర్‌టెల్‌కు గడచిన జూన్ 30 నాటికి రూ. 1.16,645.8 కోట్ల రుణాలున్నాయి. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు విదేశీ పెట్టుబడులను పెంచుకోవాలని భావిస్తోంది.