బిజినెస్

స్టాక్ మార్కెట్లకు లాభాల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 8: విదేశీ పెట్టుబడిదారుల పన్ను విధానాన్ని సరళతరం చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టనుందన్న వార్తలు దేశీయ స్టాక్ మార్కెట్లకు ఒక్కసారిగా అమిత బలాన్నిచ్చాయి. గురువారం బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ 737 పాయింట్లు ఎగబాకగా, బ్రాడర్ నిఫ్టీ సైతం 11.000 మార్కును మళ్లీ అధిగమించింది. ఆరంభం నుంచి సంతృప్తికర లాభాలతో సాగిన సెనె్సక్స్ చివరి గంటల్లో ఊపందుకున్న వాటాల కొనుగోళ్లతో ఒక్కసారిగా భారీ లాభాలకు పరుగులు పెట్టింది. ప్రధానంగా విద్యుత్, బ్యాంకింగ్, ఐటీ కౌంటర్లలో లాభాల పంట పండింది. ఈ క్రమంలో సెనె్సక్స్ 636.86 పాయింట్ల ఆధిక్యాన్ని అందుకుని 1.63 శాతం లాభపడి 37,327.36 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. అలాగే నిఫ్టీ 176.95 పాయింట్లు ఎగబాకి 1.63 శాతం లాభపడి 11,032.45 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. గత మే 20 నుంచి ఈ రెండు దేశీయ సూచీలకు ఇవే అత్యధిక స్థాయి లాభాలు కావడం విశేషం. మొత్తం మార్కెట్ విలువ 3.6 శాతం పెరిగింది. కాగా ఇటీవలి కేంద్ర బడ్జెట్ సమావేశంలో విదేశీ పెట్టుబడులపై సర్‌చార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించడంతో స్టాక్‌మార్కెట్లపై విపరీత ప్రభావం నెలకొన్న నేపథ్యంలో ఆ నిర్ణయంపై పునఃసమీక్ష చేయాలని భావిస్తున్నట్టు తాజాగా వార్తా కథనాలు వెలువడ్డాయి. ప్రత్యేకించి దీర్ఘకాలిక వౌలిక ప్రయోజన పన్ను విధించే యోచనను విరమించుకోవాలని, తద్వారా పెట్టుబడులను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలు రావడం మార్కెట్ సెంటిమెంటుపై సానుకూల ప్రభావం చూపింది. ఈ క్రమంలో జూలై నుంచి వాటాల విక్రయం వైపే అధికంగా మొగ్గు చూపిన విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) గురువారం మార్కెట్ చివరి గంటల్లో వైఖరి మార్చుకుని ఒక్కసారిగా వాటాల కొనుగోళ్లకు దిగారు. ఇప్పటి వరకు జరిగిన విక్రయాల వత్తిడితో డీలా పడిన రూపాయి విలువకు సైతం తాజాగా ఊతం లభించింది.
అధికంగా లాభపడిన కంపెనీలివే..
సెనె్సక్స్ ప్యాక్‌లో గురువారం అత్యధికంగా లాభపడిన కంపెనీల జాబితాలో హెచ్‌సీఎల్ టెక్, టాటామోటార్స్, ఎం అండ్ ఎం, బజాజ్ ఆటో, ఆర్‌ఐఎల్, హీరోమోటోకార్ప్, ఎస్ బ్యాంక్, మారుతి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. ఈ కంపెనీలు 6.43 శాతం అదనంగా లాభపడ్డాయి. ఈ ప్యాక్‌లో కేవలం టాటాస్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మాత్రమే 3.77 శాతం నష్టపోయాయి. ఇలావుండగా కేంద్ర బడ్జెట్ సమావేశాల తరువాతి నుంచి కొన్ని రోజులుగా నెలకొన్న అమ్మకాల వత్తిడితో దేశ ఆర్థికాభివృద్ధిలో మందగమనం చోటుచేసుకోవడంతోబాటు వివిధ రంగాల్లో ప్రగతి సైతం స్తంభించడం కనిపించింది. అంతర్జాతీయంగా వాణి జ్య యుద్ధాల వంటి ప్రతికూలతలు సైతం ఇందుకు తోడయ్యాయి. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయ సేకరణ ఆ రంభించింది. ఈ విధాన ఫలితాలపై అప్పుడే ఒక అంచనాకు రావ డం తగదని వాణిజ్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అన్ని రంగాల సూచీలూ లాభాల్లోనే..
రంగాల వారీగా చూస్తే అన్ని సూచీలూ లాభాల బాట పట్టాయి. ప్రధానంగా బీఎస్‌ఈలో విద్యుత్, వాహన, ఐటీ, టెక్, చమురు, సహజవాయువులు, టెలికాం, స్థిరాస్తి, బ్యాంకెక్స్, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, లోహ, వినిమయ వస్తువుల సూచీలు గురువారం పరుగులు పెట్టి 3.15 శాతం లాభపడ్డాయి. అలాగే బ్రాడర్ బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు సైతం 0.74 శాతం లాభాలను సంతరించుకున్నాయి.
స్థిరంగా అంతర్జాతీయ మార్కెట్లు..
ఓ వైపు వాణిజ్య యుద్ధ భయాలు వెన్నాడుతున్నా మరోవైపు చైనా వాణిజ్య గణాంకాలు ఆసియా మార్కెట్లకు ఆలంబనగా నిలిచాయి. ఈక్రమంలో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో స్థిరత్వం కొనసాగింది. ఆసియాలో షాంఘై కాంపోజిట్ సూచీ, హ్యాంగ్‌సెంగ్, కోస్పి, నిక్కీ లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో సానుకూలంగానే సాగాయి. ఇక వాటాల కొనుగోళ్లు ఊపందుకోవడంతో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ గురువారం 23 పైసలు లాభపడి ఇంట్రాడేలో 70.66 రూపాయలుగా ట్రేడైంది. అలాగే ముడిచమురు ధరలు సైతం 1.58 శాతం లాభపడి బ్యారెల్ 57.12 డాలర్ల వంతున ట్రేడైంది.