బిజినెస్

5జీ నెట్‌వర్క్‌పై చైనా బ్లాక్ మెయల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 7: హవాయ్‌కు చెందిన 5జీ వౌలిక పరికరాలను వినియోగించుకోవాల్సిందిగా భారత్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తోందని అమెరికన్ కాంగ్రెస్ ప్రముఖుడు జిమ్‌బ్యాంక్స్ ఇక్కడ ఆరోపించారు. అలాగే ఈ విషయంలో అమెరికా వత్తిడులను భారత్ ఖాతరు చేయదన్న విశ్వాసం సైతం చైనా పెద్దలకు ఉందని ఆ అధికారి మంగళవారం నాడిక్కడ వ్యాఖ్యానించారు. ప్రపంచలో టెలికాం పరికరాల తయారీ, మార్కెటింగ్‌లో అగ్రగణ్యంగా వెలుగొందుతున్న హవాయ్ స్మార్ట్ఫోన్ల తయారీలో సైతం ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే భద్రతా పరమైన కారణాలు చూపి అమెరికా హవాయ్ టెలికాం పరికరాలపై నిషేధం వించడం జరిగింది. భారత్ సహా అన్ని మిత్ర దేశాలూ ఈ ఆంక్షలకు కట్టుబడి ఉండాలని సైతం వత్తిడి తెస్తోంది. ప్రధానంగా 4జీ ఎల్‌టీఈ నెట్‌వర్క్ కంటే సుమారు 10 నుంచి 100 రెట్ల డౌన్‌లోడ్ వేగంతో వెలువడనుసన్న 5జీ తదుపరి తరం సెల్యులార్ సాంకేతికతలో చైనా (హవాయ్) పరికరాల భాగస్వామ్యం ఉండడరాదన్నది అమెరికా లక్ష్యం. ఈక్రమంలో చైనా హవాయ్ పరికరాలను 5జీ నెట్‌వర్క్ కోసం వినియోగించుకోవాల్సిందిగా భారత్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తోందని అమెరికన్ కాంగ్రెస్ ప్రముఖుడు జిమ్ బ్యాంక్స్ ఆరోపించి చర్చకు తెరలేపారు. తదుపరి తరం మొబైళ్లతో కూడిన 5జీ నెట్‌వర్క్ పలు విషయాల్లో అత్యంత కీలక భూమిక పోషిస్తుందని, ఇందులోప్రధానంగా అత్యాధునిక స్మార్ట్ఫోన్లతోబాటు డ్రైవర్లు లేకుండా కార్లు నడపడం కూడా ఉంటుందని జిమ్ తెలిపారు. ‘చైనాకు చెందిన కమ్యూనిస్ట్ నేతలు అన్ని దేశాలపై గూఢచర్యం చేస్తూ తామే ఆ దేశాలను ఆదుకునే వారిగా ప్రచారం చేసుకుంటున్నార’ని జిమ్ ఆరోపించారు. ఇలావుండగా ‘5జీ వ్యవస్థకు సంబంధించిన ట్రయల్స్ నుంచి అన్ని దశల్లో హవాయ్ వౌలిక పరికరాలను వినియోగించడంలో భారత్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని తమ దేశానికి బాసటగా నిలుస్తుంద’ని బుధవారం నాడు చైనా ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఇలావుండగా 5జీ నెట్‌వర్క్ విషయంలో భారత్ పూర్తిగా సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల స్పష్టం చేయడం జరిగింది. ఐతే చైనాతోబాటు అక్కడి ప్రభుత్వ నిర్వహణలోని ‘హవాయ్’ సంస్థ అమెరికా, దాని మిత్ర దేశాల్లో గూఢచర్య వ్యవస్థ కలిగిన పరికరాలను జొప్పించేందుకు కుట్ర చేస్తున్నాయని అమెరికన్ సెనేటర్ మార్ష్ బ్లాక్‌బర్న్ ఆరోపించారు. జాతీయ, మేధో సంపదలను కాపాడుకునేందుకు అనుగుణంగా అప్రమత్తమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు.