బిజినెస్

సెనె్సక్స్ పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 7: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ)లో బుధవారం సెనె్సక్స్ 286.35 పాయింట్లు పతనమైంది. కాశ్మీర్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన తర్వాత వివిధ దేశాల ప్రతిస్పందన భారత స్టాక్ మార్కెట్‌లో ప్రభావం చూపింది. దీనికి తోడు అంతర్జాతీయ సూచీలు కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంతో బీఎస్‌ఈలో సెనె్సక్స్, అదేవిధంగా జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ నష్టాలు చవిచూశాయి. మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ల ధర 5.62 శాతం పతనమైంది. టాటా స్టీల్స్ షేర్లు 4.75 శాతం నష్టాల్లో ట్రేడయ్యాయి. టాటా మోటార్స్ 4.20 శాతం, ఎస్‌బీఐ 3.75 శాతం, వేదాంత 3.02 శాతం చొప్పున నష్టాలను చవిచూశాయి. అయితే, ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్న హెచ్‌యూఎల్ 1.95 శాతం లాభాలను ఆర్జించింది. ఎస్‌బ్యాంక్ షేర్లు 1.70 శాతం లాభాల్లో ట్రేడయ్యాయి. హీరో మోటార్స్ 1.54 శాతం, సన్ ఫార్మా 0.80 శాతం, ఇండస్‌ఇండ్ 0.72 శాతం చొప్పున నష్టాలను చవిచూశాయి. ఇలావుంటే ఎన్‌ఎస్‌ఈలో ఇండియాబుల్స్ కంపెనీ షేర్ల ధర ఏకంగా 13.4 శాతం పడిపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా 5.92 శాతం, టాటా స్టీల్స్ 5.88 శాతం, టాటా మోటార్స్ 4.33 శాతం, బీపీసీఎల్ 4.27 శాతం నష్టపోయాయి. అంతర్జాతీయంగా ఆర్థిక, సామాజిక పరిస్థితులు నిలకడగా లేనందున మరికొంతకాలం పాటు స్టాక్‌మార్కెట్ లో అనిశ్చితి తప్పదని విశే్లషకులు భావిస్తున్నారు.