బిజినెస్

యువాన్ విలువను తగ్గించిన చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాంఘై, ఆగస్టు 7: చైనా మరోసారి బుధవారం తన కరెన్సీ అయిన యువాన్ డెయిలీ రెఫరెన్స్ రేట్‌ను తగ్గించింది. దీంతో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే యువాన్ మారకం విలువ మరింత బలహీనపడింది. చైనా, అమెరికా మధ్య కరెన్సీ వివాదం తీవ్రమయిన నేపథ్యంలో చైనా కేంద్ర బ్యాంకు తన కరెన్సీ విలువను తగ్గించింది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా బుధవారం అమెరికన్ డాలర్‌తో యువాన్ సెంట్రల్ ప్యారిటి రేట్‌ను 6.9996గా ఖరారు చేసింది. మంగళవారం ఖరారు చేసిన స్థాయితో పోలిస్తే మరింత తగ్గింది. అమెరికన్ డాలర్‌తో చైనా యువాన్ మారకం విలువ మంగళవారం 11 సంవత్సరాల కనిష్ట స్థాయిని తాకింది. బుధవారం ఉదయం తరువాత జరిగిన ట్రేడింగ్‌లో ఆన్‌షోర్, ఆఫ్‌షోర్‌లో యువాన్ విలువ వరుసగా 7.0454, 7.0796గా నమోదయింది. డాలర్‌తో పోలిస్తే యువాన్ మారకం విలువ సోమవారం కీలకమయిన 7.0 స్థాయికన్నా దిగువకు దిగజారింది. చైనానుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి దిగుమతి సుంకాలను పెంచాలని యోచిస్తున్నట్టు అమెరికా ప్రకటించినప్పటి నుంచి డాలర్‌తో మారకంలో యువాన్ బలహీనపడుతోంది. చైనా ఒక ‘కరెన్సీ మానిపులేటర్’ అని కూడా అమెరికా నిందించింది. అమెరికా అలాంటి ముద్ర వేయడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నట్టు చైనా సెంట్రల్ బ్యాంక్ మంగళవారం తెలిపింది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా పోటీతత్వంతో యువాన్ విలువను తగ్గించబోదని కూడా ఆ బ్యాంక్ గవర్నర్ యి గాంగ్ ప్రకటించారు. యువాన్ మారకం విలువను తగ్గించడం వల్ల చైనా ఎగుమతులు చౌకగా మారుతాయి. అమెరికా దిగుమతి సుంకాలు పెంచడం వల్ల పడిన భారం కొంత వరకు తగ్గుతుంది. అమెరికన్ డాలర్‌తో చైనా యువాన్ మారకం విలువ గత అయిదు సంవత్సరాలుగా 6.1-7.1 మధ్య కదలాడుతోంది.