బిజినెస్

భారత్-అమెరికా బంధాల్లో మార్పుతో సరికొత్త సవాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానంగా వాణిజ్యపరమైన సమస్యలను తక్షణం పరిష్కరించుకోవాలి
అమెరికాలో భారత దౌత్యవేత్త ష్రింగ్లా సూచన
భారత వాణిజ్య మంత్రితో అమెరికా వాణిజ్య ప్రతినిధి భేటీ అవుతారని వెల్లడి

వాషింగ్టన్, ఆగస్టు 7: అమెరికా-్భరత్ మధ్య ప్రస్తుత సంబంధాల దృష్ట్యా వాణిజ్యపరంగా పలు సరికొత్త సవాళ్లు తలెత్తుతున్నాయని అమెరికాలోని భారత దౌత్యవేత్త హర్షవర్ధన్ ష్రింగ్లా బుధవారం నాడిక్కడ అభిప్రాయపడ్డారు. ద్వైపాక్షిక బంధాలు బలోపేతం చేసుకోవడంతోబాటు ఇరు దేశాలకూ లబ్ధిచేకూరేలా సంతృప్తికర నిర్ణయాలు తీసుకునేందుకు త్వరలో కృషి జరుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తక్షణం సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అంశం వాణిజ్యమేనని, అమెరికా సైతం భారత్‌తోబాటు ఇతర ప్రపంచ దేశాలతో సరికొత్త బలోపేతమైన వాణిజ్య బంధాలను ఏర్పరచుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తోందని ఆయన చెప్పారు. ‘హెరిటేజ్ ఫౌండేషన్’ నేతృత్వంలో నిర్వహించిన ’్థంక్ ట్యాంక్’ కార్యక్రమంలో ష్రింగ్లా మాట్లాడారు. గత జూన్ మాసంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జపాన్‌లోని ఒసాకో జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కలుసుకున్నపుడు వారి అధికార గణాలతో కలిసి ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్యపరమైన సమస్యలపై కూలంకషంగా చర్చించడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దానికి కొనసాగింపుగా భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్, అమెరికాకు చెందిన వాణిజ్య శాఖ ప్రతినిధి రాబర్ట్ లిగ్తిజర్‌తో త్వరలో సమావేశం కానున్నారని ష్రింగ్లా వెల్లడించారు. ఆ సందర్భంగా ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలకు తుదిరూపం వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వాణిజ్యంతోబాటు మరికొన్ని దీర్ఘకాలిక అంశాలను సైతం ఇరు దేశాలూ పరిష్కరించుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. ప్రధానంగా భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం స్థిరంగా కొనసాగాలని కోరుకుంటున్నామని, ఇది కార్యరూపం దాల్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని ష్రింగ్లా పేర్కొన్నారు. స్వల్పకాలిక ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే తొలుత ద్వైపాక్షిక బంధాలు బలపడాలని ఆయన ఆకాంక్షించారు.
రాబోయే 50 సంవత్సరాల వరకు ఆ నిర్ణయాలు ప్రయోజనం చేకూర్చాలని సూచించారు.