బిజినెస్

పాలస్తీనా శరణార్థులకు భారత్ సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జేరూసలేం, ఆగస్టు 7: ఐక్యరాజ్య సమితి పాలస్తీనా శరణార్థుల ఏజెన్సీకి 5 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని భారత దేశం బుధవారం అందజేసింది. ఆ ఏజెన్సీ చేపడుతున్న సహాయక చర్యలకు తదుపరి కూడా స్థిరమైన ఆర్థిక సాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక సాయానికి చెందిన చెక్కును జెరూసలేంలోని పాలస్తీనా శరణార్థుల ఐక్య రాజ్యసమితి సహాయ, పునరావాస, పనుల నిర్వహణ ఏజెన్సీ (యూఎన్‌ఆర్‌డబ్ల్యు)కి భారత ప్రతినిధి సునిల్ కుమార్ అందజేశారు. ఇప్పటి వరకు భారత వార్షిక సాయంగా 1.25 మిలియన్ డాలర్లు అందిస్తుండగా తాజాగా ఆ మొత్తాన్ని 5 మిలియన్ డాలర్లకు పెంచింది. గత ఏడాది ఫిబ్రవరి నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలస్తీనాలో పర్యటించారు. ఏ భారత ప్రధాని వెళ్లని రమల్లాహ ప్రాంతాన్ని ఆయన తొలిసారి సందర్శించారు. ఆ సందర్భంగా శరణార్థుల సహాయ ఏజెన్సీ తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్న విషయాన్ని మోదీ గమనించారు. వెంటనే స్పందించి అందిస్తున్న వార్షిక సాయాన్ని పెంచేందుకు చర్యలు చర్యలు తీసుకున్నారు. కాగా యూఎన్‌ఆర్‌డబ్ల్యుఏ వంటి ఇతర సంప్రదాయ ఏజెన్సీలు సైతం తమ సహాయాలను పెంచాలని భారత్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది. అలాగే ఇప్పటి వరకు సాయం చేయని దేశాలు సైతం స్పందించాలని కోరింది.