బిజినెస్

నిర్వహణ వ్యయ నియంత్రణపై బీఎస్‌ఎన్‌ఎల్ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) ఖర్చులను నియంత్రించే విషయంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘ఔట్‌సోర్సింగ్’ విధానాన్ని మరింతగా బలోపేతం చేసి విస్తరించాలని, తద్వారా ప్రతిఏటా కనీసం రూ.200 కోట్లు ఆదా చేయాలని భావిస్తోంది. అలాగే విద్యుత్ బిల్లులను సైతం తగ్గించుకోవడం ద్వారా ఇందుకు సంబంధించిన 15 శాతం ఖర్చును ఆదా చేసేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ మంగళవారం నాడిక్కడ తెలిపారు. ఈ ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థ సుమారు రూ. 800 కోట్ల మేర నెలావారీ ఆదాయం, ఖర్చుల మధ్య కొరతను ఎదుర్కొంటోందని ఆయన వెల్లడించారు. నిర్వహణ, వేతనాల ఖర్చుల విషయంలో తీవ్ర ద్రవ్యలోటును ఎదుర్కొంటున్న క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. ఈ ఏడాది రెండోసారి ఉద్యోగులకు జీతాలు చెల్లించే విషయంలో ఆలస్యం చోటుచేసుకుందన్నారు. జూలై నెల జీతాలకు సంబంధించిన నిధులు సోమవారం విడుదల చేశామన్నారు. జీతాలు, నిర్వహణ (ఆపరేషన్స్) పరంగా చూస్తే టెలికాం శాఖ నుంచి కంపెనీ ఎలాంటి ఆర్థిక సాయం అర్థించకుండానే జీతాలు ఇవ్వగలిగే స్థితి ప్రస్తుతానికి ఉందని, ఐతే నిర్వహణ (ఆపరేషన్స్) విభాగంలో లోటుపాట్లను సవరించి వృథా ఖర్చును తగ్గించుకోవాలని నిర్ణయించామని పుర్వార్ పీటీఐకి చెప్పారు. ఇందులో భాగంగా ప్రస్తుతం నిర్వహణ ఖర్చులపై సమీక్షిస్తున్నామని, ప్రధానంగా ప్రస్తుతం అమలులో ఉన్న ఔట్‌సోర్సింగ్ విధానం తీరుతెన్నులపై దృష్టి నిలిపామని తెలిపారు. ఈదిశలో ఏడాదికి కనీసం 100 నుంచి 200 కోట్ల రూపాయల మేర ఆదా చేసేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. ఐతే వినియోగదారుల సేవ విషయంలో ఎలాంటి నాణ్యతాలోపం తలెత్తకుండా జాగ్రత్తపడతామని, ఈ విషయంలో రాజీపడేది లేదని ఆయన చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల మరమ్మతుల నిర్వహణలో ఔట్‌సోర్సింగ్ ద్వారా జరుగుతున్న పనులకు సంబంధించిన ఖర్చులు తగ్గించేందుకు కృషి జరుగుతోందన్నారు. అలాగే టెలిఫోన్ ఎక్చేంజీల్లో వినియోగిస్తున్న విద్యుత్‌ను ఆదా చేయడంపైనా దృష్టి నిలిపామన్నారు. ప్రధానంగా తమ కంపెనీ వ్యవహారాల్లో విద్యుత్ వినియోగం ప్రధానంగా జరుగుతోందని పుర్వార్ చెప్పారు. ఇలావుండగా అటు బీఎస్‌ఎన్‌ఎల్‌తోబాటు ఇటు మహానగర్ టెలిపోన్ నగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్‌ఎల్) సంక్షోభాన్ని నివారించేందుకు కేంద్ర టెలికాం శాఖ ఓ ‘్భద్రతా ప్రణాళికకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఈ రెండు కంపెనీలు పునరుద్ధరణ ప్యాకేజీ పరిధిలోకి వస్తాయి. ప్రధానంగా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం, ఆస్తుల క్రయ విక్రయాలు, 4జీ కేటాయింపులు వంటివి పునరుద్ధరణ ప్యాకేజీ పరిధిలోకి వస్తాయి. అలాగే విలీనానికి సంబంధించిన ప్రతిపాదన సైతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఐతే ఈ ఏడాది బీఎస్‌ఎన్‌ఎల్ నష్టం మాత్రం గణనీయంగా తగ్గుతోంది. గత ఏడాది రూ. 19,308 కోట్ల నష్టం రాగా ఈ ఏడాది అంతానికి నష్టం 14,000 కోట్లకు తగ్గవచ్చని అంచనా.