బిజినెస్

గణనీయంగా పుంజుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 6: బ్యాంకింగ్, వాహన రంగాల స్టాక్స్ లాభాలు పండించడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ప్రధానంగా ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన నిర్ణాయ కమిటీ (సీఎంపీ) బుధవారం మరో 25 బేసిస్ పాయింట్ల మేర కోత విదించే అవకాశాలున్నాయన్న వార్తలు పై రెండు రంగాల వృద్ధిపై మదుపర్లలో నమ్మకం పెరిగింది. ఈక్రమంలో బీఎస్‌ఈలో 30 షేర్ల సెనె్సక్స్ 277.01 పాయింట్లు ఎగబాకి 0.75 శాతం లాభాలతో 36,976.85 వద్ద స్థిరపడింది. ఈ సూచీ ఒక దశలో 37,241.77 పాయింట్ల గరిష్టాన్ని, మరో దశలో 36,536.59 పాయింట్ల కనిష్టాన్ని స్పృశించింది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో 50 షేర్ల నిఫ్టీ సైతం 85.65 పాయింట్ల ఆధిక్యతతో 0.79 శాతం లాభపడి 10,948.25 పాయింట్ల వద్ద స్థిరపడింది. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో ఎస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, మారుతి, ఏసియన్ పెయింట్స్, హీరోమోటోకార్ప్ అత్యధికంగా 5.30 శాతం లాభపడ్డాయి. మరోవైపు పవర్‌గ్రిడ్, టీసీఎస్, ఆర్‌ఐఎల్, టాటామోటార్స్, బజాజ్ ఆటో, వేదాంత, ఇన్ఫోసిస్, ఐటీసీ 1.52 శాతం నష్టపోయాయి. ఇలావుండగా బుధవారంతో ముగియనున్న మూడు రోజుల ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో మరో 25 బేసిస్ పాయింట్ల మేర రెపోరేట్ల కోత ఉంటుందని మదుపర్లు గట్టిగా విశ్వసించడం వల్లే మంగళవారం మార్కెట్లు కోలుకున్నాయని ప్రముఖ విశే్లషకుడు నరేంద్ర సోలంకి అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ద్వైమాసిక విధాన నిర్ణయంపై సమీక్షించేందుకు ఆర్బీఐ ఎంపీసీ సమావేశం గవర్నర్ శక్తికాంతదాస్ అధ్యక్షతన సోమవారం నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశ వృద్ధిరేటుకు ఊతం ఇచ్చేలా మరోదఫా రెపోరేట్ల విధించాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్న క్రమంలో బుధవారం ఏ నిర్ణయం వెలువడుతుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. వివిధ రంగాల ప్రముఖులతో చర్చించి వారి సమస్యల పరిష్కారానికి వాస్తవిక, నిర్మాణాత్మక చర్యలు చేపడతామని సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ విలేఖరులతో మాట్లాడుతూ ప్రకటించడం జరిగింది. ఈ మాటలు దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చాయని విశే్లషకులు భావిస్తున్నారు.
నష్టాల్లో ఆసియా మార్కెట్లు
ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. షాంఘై కాంపోజిట్ సూచీ, హ్యాంగ్‌సెంగ్, నిక్కీ, కోస్పి అధిక నష్టాల పాలయ్యాయి. ఐరోపా మార్కెట్లు మాత్రం ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలతో సాగాయి. ఇక అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు పెరిగి ఇంట్రాడేలో రూ. 70.80గా ట్రేడైంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 0.48 శాతం వృద్ధితో బ్యారెల్ 60.10 డాలర్లు వంతున ట్రేడైంది.