బిజినెస్

‘బాంబే డైయింగ్’ త్రైమాసిక లాభాలు రూ. 27.65 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : బాంబే డైయింగ్ అండ్ మానుఫాక్చురింగ్ కో లిమిటెడ్ సోమవారం నాడిక్కడ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. గత జూన్ మాసంతో ముగిసిన త్రైమాసికంలో రూ. 27.65 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్టు ఆ కంపెనీ తెలిపింది. గత ఏడాది ఇదే కాలానికి ఈ కంపెనీ రూ. 93.70 కోట్ల నష్టాన్ని చూపింది. కాగా కంపెనీ మొత్తం ఆదాయం 64.09 శాతం వృద్ధిచెంది ఈ మూడు నెలల కాలంలో 673.30 కోట్లకు చేరిందని తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 410.31 కోట్ల ఆదాయం వచ్చిందని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వివరించింది. కంపెనీకి చెందిన స్థిరాస్తి విభాగం ద్వారా తాజా త్రైమాసికంలో రూ. 250.33 కోట్ల ఆదాయం వచ్చిందని, గత ఏడాది ఇదే కాలంలో కేవలం రూ. 11.77 కోట్లు మాత్రమే సమకూరిందని వెల్లడించింది. అలాగే పాలియస్టర్ విభాగం నుంచి రూ. 341.45 కోట్ల ఆదాయం వచ్చిందని, రీటైల్, టెక్స్‌టైల్స్ విభాగాల నుంచి రూ. 56.79 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ ఆదాయాలు వరుసగా రూ. 338.58 కోట్లు, రూ. 47.11 కోట్ల వంతున ఉండేవని తెలిపింది. ఇలా వుండగా ఈ కంపెనీ వాటాలు సోమవారం బీఎస్‌ఈలో 5.44శాతం వృద్ధితో ఒక్కోవాటా రూ. 69.75గా ట్రేడైంది.