బిజినెస్

ప్రైవేటు బాటలో భారతీయ రైల్వేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 5: భారతీయ రైల్వేలోప్రైవేటీకరణ ఊపందుకుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దీన్ని స్పష్టం చేస్తోంది. ఈనెల 2న దేశవ్యాప్తంగా రైల్వేలతో పాటు ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ అన్ని కార్మిక యూనియన్లు ధర్నాలు చేపట్టాయి. రైల్వేల ప్రైవేటీకరణకు ఊతమిచ్చే విధంగా బోర్డ్ తీసుకున్న నిర్ణయాలను అధికార వర్గాలు ధృవీకరిస్తున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రెండు అంశాలను ముందుకు తీసుకువస్తోంది. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు, సంస్థను పటిష్టం చేయడానికి ప్రైవేటీకరణ తప్పదని కేంద్ర భావిస్తోంది. కాగా రైల్వేలను ప్రైవేటీకరించడానికి గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సంతానం కమిటీని ఏర్పాటు చేసింది. సంతానం కమిటీ సూచనల మేరకే రైల్వేల ప్రైవేటీకరరణకు బీజం పడింది. ఈ ప్రక్రియలో భాగంగా రైల్వేల ప్రైవేటీకరణకు కోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రైవేటీకరణలో భాగంగా రైల్వే వ్యాగన్లు, బోగీలు, స్టేషన్లు, వర్క్‌షాపులు, ప్రయాణ ప్రాంగణాలు, క్లీనింగ్, బోగీలను నీటితో నింపడం వంటి కార్యక్రమాలకు టెండర్లు పిలవడం జరుగుతోంది. ప్రస్తుతం భారతీయ రైల్వేల్లో దాదాపు 13లక్షల మంది ఉద్యోగ, కార్మికులు పని చేస్తున్నారు. రానున్న రోజుల్లో వారి సంఖ్యను గణనీయంగా 10 లక్షలకు కుదించాలని కేంద్రం వేగంగా చర్యలు చేపట్టింది. దీనిపై రైల్వే బోర్డు ఇప్పటికే మార్గదర్శకాలు రూపొందించింది. రైల్వే బోర్డు ప్రతిపాదనలను దేశంలో ఉన్న 17 జోన్లకు పంపారు. ఆయా జోన్లలో పని చేస్తున్న ఉద్యోగ, కార్మికుల పనితీరుపై నివేదికలను సిద్ధం చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేశారు. దీంతో జోన్లలో ఉద్యోగ, కార్మికుల బయోడేటాను బయటకు తీస్తున్నారు. ఉద్యోగుల వయస్సు 55, సర్వీసు 30 ఏళ్లు ప్రామాణికంగా తీసుకుని పదవీ విమరణ చేయించాలన్న ప్రాతిపాదనతో ముందుకెళ్తున్నారు. తాజాగా బోర్డు నిబంధనలకు అనుగుణంగా కనీసం 3 నుంచి 4 లక్షల మందిని నిర్బంధ పదవీ విరమణ చేయాల్సి ఉంటుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఇది అన్ని కేటగిరిల్లోల్లో అమలుచేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. రైల్వేల్లో ప్రక్షాళనతోపాటు కార్మిక సంఘాల పెత్తనాన్ని తగ్గించడానికి కేంద్రం శ్రీకారం చుట్టిందని అంటున్నారు. యూనియన్ నేతలుగా దశాబ్దాలుగా కొనసాగుతున్న వారినీ ఇంటికి పంపడానికి కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. ప్రస్తుతం రైల్వేలో ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ ( ఎఐఆర్‌ఎఫ్), నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే ( ఎన్‌ఎఫ్‌ఐఆర్) గుర్తింపు యూనియన్లుగా పని చేస్తున్నాయి. మూడో యూనియన్ ఏర్పాటు కాకుండా గుర్తింపు యూనియన్లు అడ్డుపడుతున్నాయని భారతీయ మజ్దూర్ సంఘ్ ఆరోపిస్తోంది. కొత్త యూనియన్ ఏర్పాటుకు లేని నిబంధనలను గుర్తింపుయూనియన్లు ముందుకు తీసుకువస్తున్నాయని బీఎంఎస్ పేర్కొంది. కాగా రైల్వే బోర్డు ప్రతిపాదనలను కార్మిక సంఘాలు బాహటంగా విమర్శిస్తున్నాయి. అయితే బోర్డుతో గుర్తింపు యూనియన్లు మిలాఖత్ కావడంతో తప్పనిసరి పదవీ విరమణ అంశం తెరపైకి వచ్చిందని బీఎంఎస్ మండిపడుతోంది.
కాగా దేశంలో ఏడు భారీ రైల్వే వర్క్‌షాపులు పని చేస్తున్నాయి. చిత్తరంజన్, వారణాసి, చెన్నై, కపూర్‌తలా, బెంగళూరు, పాటియాలా, తిరుపతిలో రైళ్లకు సంబంధించిన వివిధ విభాగాలు పని చేస్తున్నాయి. వీటితో పాటు మరో 46 రైల్వే వర్క్‌షాపులున్నాయి. వర్క్‌షాపుల్లో పదవీ విరమణ చేస్తున్న కార్మికుల స్థానంలో భర్తీచేయడానికి బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవన్నీ చూస్తే భారతీయ రైల్వేల్లో దశలవారీ ప్రైవేటీకరణ తప్పదని తేలిపోయింది.