బిజినెస్

వరుసగా ఐదేళ్లు 9 శాతం వార్షిక వృద్ధి రేటు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ప్రధాని మోదీ లక్ష్యం మేరకు మనదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా రూపాంతరం చెందాలంటే ప్రతి ఏటా దేశ వృద్ధిరేటు ప్రతిఏటా 9 శాతంగా ఉండాలని, అలాగే సరాసరి పెట్టుబడులు సైతం జీడీపీలో 38 శాతంగా ఉండాలని లండన్‌కు చెందిన బహుళ జాతి వృత్తి సేవల సంస్థ ఈఎంఎస్‌టీ అండ్ యంగ్ (ఈవై) తాజా అధ్యయన నివేదిక సూచించింది. ప్రస్తుత సంవత్సరం 7 శాతం వృద్ధిరేటు అంచనాలతో ఆరంభమైనందున గత ఏడాది ఆర్థికాభివృద్ధి 2.7 ట్రిలియన్ డాలర్లు దాటి 2020 మార్చి 31 నాటికి 3ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆ ఆధ్యయనం అంచనా వేసింది. ఐతే ఇది వృద్ధిరేటు వరుసగా ఐదేళ్లపాటు 9 శాతం వంతున ఉంటే 2021 నాటికి 3.3 ట్రిలియన్లకు, 2022లో 3.6ట్రిలియన్లకు, 2023లో 4.1ట్రిలియన్లకు, 2024లో 4.5 ట్రిలియన్లకు, 2025లో 5ట్రిలియన్ డాలర్లకు చేరేందుకు వీలుంటుందని ఆ నివేదిక సూచించింది. ఐతే ప్రస్తుత సంవత్సరాన్ని 4 శాతం ద్రవ్యోల్బణ రేటుతో ఆరంభించడం ద్రవ్య వినిమయ విధాన పరిమితికన్నా చాలా అధికంగా ఉందని నివేదిక తెలిపింది. వచ్చే ఐదేళ్ల కాలానికి వృద్ధిరేటును 9శాతంగా ఉంచి 2025 మార్చి 31 నాటికి 5ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మారినా మొత్తం వృద్ధిరేటు 13 శాతంగా సాధారణ స్థాయిలోకి చేరుతుందని నివేదిక తెలిపింది. అలాగే అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా 2 శాతం తగ్గిన స్థితిలో ఈ ఆర్థిక సంవత్సరారంభం జరిగిన విషయాన్ని ఆ నివేదిక గుర్తు చేసింది. గత రెండు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితుల్లో ఉన్న రూపాయి విలువనుబట్టి మనదేశ వృద్ధిరేటు వాస్తవానికి ఈ ఏడాది అంతానికి 6.8 శాతానికి మించే అవకాశాలు లేవని ఆ అధ్యయనం స్పష్టం చేసింది. అలాగే ఇంప్లిసిట్ ఇంక్రిమెంటల్ కేపిటల్ ఔట్‌పుట్ (ఐసీఓఆర్) నిష్పత్తి సైతం 4.6 శాతమని తెలిపింది. దేశంలో ఉన్న వినిమయ సామర్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే ఇది కూడా అధికమేనని తెలిపింది. కేవలం 2012లో మాత్రమే అత్యధిక ఐసీఓఆర్ నిష్పత్తి 39.6 శాతం సాధ్యమైందని తెలిపింది. చైనా మాత్రమే సుదీర్ఘ కాలానికి సరాసరి పొదుపు, పెట్టుబడుల నిష్పత్తిని 45 శాతానికి దగ్గరగా ఉండేలా చూడగలిగిందని నివేదిక గుర్తు చేసింది. కాగా దేశంలోని మొత్తం పెట్టుబడుల్లో ప్రభుత్వ పెట్టుబడులు, గృహ పరమైన పెట్టుబడులు, ప్రైవేటు కార్పొరేట్ రంగ పెట్టుబడులు ప్రధానంగా వృద్ధి చేయడం ద్వారా 2021 నాటికి 9 శాతం వృద్థిరేటుకు చేరుకోవడానికి వీలుంటుందని జీడీపీలో పెట్టుబడుల శాతాన్ని 31.3 నుంచి 38 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని అధ్యయన నివేదిక సూచించింది. ద్రవ్యోల్బణం 4 శాతంకన్నా తక్కువగా ఉంటే విదేశీ మారక ద్రవ్య విలువ ప్రతియేటా 2 శాతం పడిపోయే ప్రమాదం ఉందని, వచ్చే ఐదేళ్లలో దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఆవిర్భవించాలన్న లక్ష్యానికి ఇది గండికొట్టవచ్చని ఆ నివేదిక అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంతో వ్యవహరిస్తూ బడ్జెటరీ మూలధన వ్యయ అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఖర్చు చేస్తూ, ప్రైవేటు పెట్టుబడులు పెరిగేలా విధాన నిర్ణయాలు చేసి ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చని నివేదిక సూచించింది. 2019 గణాంకాల మేరకు జీడీపీలో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల భాగస్వామ్యం కేవలం 1.6 శాతంగానే ఉందని అత్యంత స్వల్పమని నివేదిక వివరించింది.