బిజినెస్

దేశీయ స్టాక్ మార్కెట్లు పుంజుకుంటాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 4: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ దఫా జరుగనున్న ద్రవ్య వినిమయ విధాన నిర్ణాయక కమిటీ సమావేశంలో తీసుకోనున్న నిర్ణయం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్ల స్థితిగతులను నిర్దేశించనున్నాయని వాణిజ్య రంగ నిపుణులు విశే్లషిస్తున్నారు. అలాగే ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) మదుపుచేసే నిధులపై పన్ను సర్‌చార్జీలు వసూలు చేసేందుకు తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేసేందుకు ప్రధాన మంత్రి కార్యాలయం, ఆర్థిక మంత్రిత్వ శాఖ మధ్య చర్చలు జరిగే అవకాశాలున్నాయన్న వార్తలపై సైతం మదుపర్లు దృష్టి నిలిపారు. ఇలావుండగా మూడు రోజుల పాటు జరిగే ఆర్బీఐ ద్రవ్య వినిమయ విధాన నిర్ణాయక కమిటీ సమావేశం సోమవారం నుంచి జరుగనుండగా అందులో ఏ నిర్ణయం వెలువడుతుందన్న విష యం వాణిజ్య వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. దేశ ఆర్థికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నాల్గవ దఫా రేట్ల కోతకు ఈ సమావేశంలో నిర్ణయం జరుగుతుందన్న అంచనాలున్నాయి. ఇటీవలి దిద్దుబాటు చర్యల కారణంగా పలు సమస్యలు సమస్యలు తలెత్తాయి. ఇందులోప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా మారడం, దేశ ఆర్థికాభివృద్ధి మందగమన అంచనాలతో విదేశీ పోర్టుపోలియో పెట్టుబడులు వెనక్కు మళ్లడం కీలక సెంటిమెంటుపై విపరీత పరిణామాలకు దారితీశాయి. ఈక్రమంలో రాబోయే రోజుల్లో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలున్నాయని యాక్సిస్ సెక్యూరిటీస్ ఎండీ, సీఈవో అరుణ్ తుక్రాల్ అభిప్రాయపడ్డారు. కాగా సిల్పా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్, లుపిన్, ఎం అండ్ ఎం, టాటాస్టీల్, హెక్సావేర్ టెక్నాలజీస్, గెయిల్ ఇండియా వంటి ప్రధాన కంపెనీలు ఈ వారం తమ త్రైమాసిక ఫలితాలను వెలువరించనున్నాయి. ఈక్రమంలో ఆ వేపుకూడా మదుపర్లు దృష్టినిలిపారు. గతవారం దేశ, అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ మొత్తం 764.57 పాయింట్లు కోల్పోయి 2.1 శాతం నష్టాలను చవిచూసింది. భవిష్యత్తు రేట్ల కోతపై అమెకన్ ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలు, ఇప్పటి వరకు వెలువడిన కంపెనీల త్రైమాసిక ఫలితాలు, వాహర రంగంలో మందగించిన విక్రయాలు ఇనె్వస్టర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ విభాగం ఉపాధ్యక్షుడు సంజీవ్ జార్బడే విశే్లషించారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంఫ్ చైనా ఉత్పత్తులపై సరికొత్త పన్నులను ప్రకటించడం అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేసింది.