బిజినెస్

మరో 25 బేసిస్ పాయింట్ల మేర ఆర్బీఐ రెపో రేట్ల కోత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 4: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా నాలుగో దఫా 25 బేసిస్ పాయింట్ల మేర రెపోరేట్ల కోత విధిస్తూ విధానం నిర్ణయం చేస్తుందని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అథ్యక్షతన జరుగనున్న ఆరుగురి సభ్యుల ద్రవ్య వినిమయ విధాన నిర్ణాయక కమిటీ (ఎంపీసీ) సమావేశం ఏ నిర్ణయం తీసుకుంటున్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ద్రవ్య లభ్యతను పెంచేందుకు, అలాగే బ్యాంకుల రుణాలు తీసుకునే వారికి రెపోరేట్ల కోత వర్తించేందుకు అనుగుణంగా ఎంపీసీ నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది మూడోమారు జరుగుతున్న ఎంపీసీ ద్వైమాసిక సమావేశంలో 25 బేసిస్ పాయింట్ల మేర రెపోరేట్ల కోత విధించే అవకాశాలున్నాయని యూనియన్ బ్యాంక్ ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్ రాయ్ ఆదివారం నాడిక్కడ పేర్కొన్నారు. ప్రధానంగా దేశ ఆర్థికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సహేతుక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా పారిశ్రామికుల సంఘం (సీఐఐ) నేతలు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో సెంట్రల్ బ్యాంక్ తొలిసారిగా ద్రవ్య విధానాన్ని సరళరతం చేసే చర్యలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. దేశ వృద్ధిరేటును దృష్టిలో ఉంచుకుని ద్రవ్యోల్బణాన్ని 4 శాతం కన్నా లోపలే ఉండేలా చూడాలన్న లక్ష్యంతో రిజర్వు బ్యాంకు నిర్ణయాలు చేస్తోందని అన్నారు.
చివరి వినియోగదారుడికి కూడా రెపోరేట్ల లబ్థి చేకూరేలా ఈ దఫా రేట్లకోతం ఉండాలన్నారు. అలాగే ఆర్బీఐ కరెన్సీ నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్)ని సైతం 50 బేసిస్ పాయింట్లకు తగ్గించాలని, ఇందువల్ల సుమారు రూ. 60 వేల కోట్ల నిధులు వ్యవస్థలోకి వచ్చేందుకు వీలుకలుగుతుందని సీఐఐ సూచించింది. ఇందువల్ల బ్యాంకుల ఆర్థిక స్థితి బలోపేతమై వనరుల కొరత తీరి వ్యవస్థ చక్కబడుతుందని తెలిపింది. ప్రస్తుతం బ్యాంకు రుణాలు-డిపాజిట్ల నిష్పత్తి అత్యధికంగా 77-78గా ఉందని వెల్లడించింది. అలాగే మరో పారిశ్రామికుల సంఘం ‘అసోచమ్’ నేతలు మాట్లాడుతూ నిధులను స్వల్ప ధరలకే అందుబాటులోకి తేవడం వల్ల పెట్టుబడులు పెరిగేందుకు, తద్వారా దేశ ఆర్థికాభివృద్ధి జరుగుతుందని సూచించారు. అలాగే నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీలు) సైతం ప్రస్తుతం ద్రవ్య లోటుతో సతమతమవుతున్నాయని, ఈ సమయంలో మరో రేట్ల కోత వీటి ఆర్థిక స్థితి బలోపేతం కావడానికి, వినియోగదారుల ఖర్చు సామర్ధ్యం పెరిగేందుకు తద్వారా అటు ప్యాసింజర్, ఇటు వాణిజ్య వాహనాల కొనుగోళ్లు పెరిగేందుకు దోహదం చేస్తుందని అసోచమ్ నేతలు అభిప్రాయపడ్డారు. కాగా ప్రస్తుతం మనదేశం రీటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగిందని దీన్ని సరిదిద్దాలంటే మరోదఫా రేట్లకోత అవసరమని ప్రముఖ వాణిజ్య నిపుణుడు అన్షుమన్ మేగజైన్ సూచించారు.