బిజినెస్

నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి, ఆగస్టు 3: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న కేటీకే ఓసీటూ గనిలో గత వారం రోజులుగా భారీ వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. గత వారంలో ఒక్క రోజు మాత్రమే వెయ్యి టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది. మిగిలిన రోజుల్లో భారీ వర్షాలతో యంత్రాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రతి రోజు ఓసీ నుండి 3వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సివుండగా వర్షం దెబ్బతో భారీ యంత్రాలు సైతం పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కోట్ల రూపాయల విలువ చేసే యంత్రాలు బురదలో పని చేసే సమయంలో ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశ్యంతో అధికారులు పనులను నిలిపివేశారు. ప్రతి రోజు 3వేల టన్నుల బొగ్గు ఉత్పిత్తి అయితే సింగరేణి 60లక్షల ఆదాయం సింగరేణికి సమకూరుతుంది. ప్రస్తుతం వారం రోజులుగా ఉత్పత్తి నిలిచిపోవడంతో కోట్లల్లో సింగరేణి తన ఆదాయాన్ని నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై సింగరేణి ఎస్‌వోటూ జీ ఎం రఘుపతిని వివరణ కోరగా ఓసీలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిన మాట వాస్తవమేనని, పని స్థలాలు బురదమయం కావడం వల్ల యంత్రాలు కూడా నడువలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. యంత్రాలకు ఎలాంటి ప్రమాదం జరిగినా కోట్లల్లో నష్టం వాటిల్లుతుందని, ముందు చూపుతోనే బొగ్గు ఉత్పత్తి నిలిపివేశామని ఆయన అన్నారు. రెండు రోజుల పాటు వర్షాలు తగ్గుముఖం పడితే మూడో రోజు బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తామని రఘుపతి తెలిపారు.