బిజినెస్

దేశీయ మినరల్‌కు అంతర్జాతీయ గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: దేశీయంగా ఉన్న మినరల్‌కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని జాతీయ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమిత్‌దుబీ తెలిపారు. జాతీయ మినరల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్‌లో వాటాదారులు చూపిన ప్రత్యేక శ్రద్ధతో సంస్థకు ప్రతిష్టాత్మకమైన ఎక్స్‌లెన్స్ అవార్డు దక్కిందన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో అవార్డు ప్రదానోత్సవం జరిగిందన్నారు. ఈ సందర్భంగా స్కోప్ కార్పొరేషన్ ఎక్స్‌లెన్స్ అవార్డు 2019 సంవత్సరానికి నాంది పలికిందన్నారు. ఈ సమావేశానికి 16 దేశాల నుంచి దాదాపు 600 మంది ప్రతినిధులు హాజరయ్యారని ఆయన గుర్తు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ సమావేశంలో భవిష్యత్‌లో మినరల్‌కు సంబంధించిన అంశాలను ఫోకస్ చేయాలని ప్రతినిధులు సూచించినట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మినరల్‌పై లావాదేవీలను ప్రొత్సహిస్తే ఆర్థిక ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయన్నారు.