బిజినెస్

లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 2: వాణిజ్య వారం ముగింపు రోజైన శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ కోలుకుని లాభాల్లోకి వచ్చాయి. బీఎస్‌ఈలోప్రధానంగా వాహన, ఐటీ, ఫైనాన్స్ రంగాల స్టాక్స్ అథికంగా లాభపడ్డాయి. మరోవైపు చైనా వస్తువుల దిగుమతులపై తాజా సుంకాలను అమెరికాప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు కుదేలయ్యాయి. బీఎస్‌ఈలో 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 99.90 పాయింట్ల ఆధిక్యతతో 0.27 శాతం లాభపడి 37,118.22 పాయింట్ల ఎగువన స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సైతం 17.35 పాయింట్లు ఎగబాకి 0.16శాతం లాభాలతో 10,997.35 పాయింట్ల వద్ద స్థిరపడింది. కాగా తనఖాలపై రుణాలు ఇచ్చే హెచ్‌డీఎఫ్‌సీ వాటాలు 1.75 శాతం లాభపడ్డాయి. ఇందుకు కారణం ఈ సంస్థ గడచిన జూన్ మాసంతో ముగిసిన త్రైమాసికానికి 46 శాతం అదనంగా రూ. 3,203.10 కోట్ల నికర లాభాలను చూపడమేనని విశే్లషకులు పేర్కొంటున్నారు. అలాగే భారతీ ఎయిర్‌టెల్, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, మారుతి, ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, హీరోమోటోకార్ప్, టీసీఎస్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్ సైతం 6.02 శాతం లాభపడ్డాయి. మరోవైపు ఎస్‌బీఐ, టాటాస్టీల్, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్, వేదాంత, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ 2.76 శాతం నష్టపోయాయి. కాగా విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌పీఐలు) గురువారం రూ. 1,056.55 కోట్ల విలువైన వాటాలు విక్రయించారు.
ట్రంప్ వ్యాఖ్యలతో మార్కెట్లు కుదేలు
చైనా ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా అదనపు సుంకాలను ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు కుదేలయ్యాయి. ప్రతి 300 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా 10 శాతం లెవీని వసూలు చేస్తుందని ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఈ సుంకాలను తగ్గించాల్సిందిగా ఇప్పటికే చైనా కోరుతుండగా తాజా లెవీ ప్రకటనతో చైనా దిక్కుతోచని స్థితికి చేరింది. ఆసియా మార్కెట్లలో షాంఘై కాంపోజిట్ సూచీ, హ్యంగ్‌సెంగ్, కోస్పి, నిక్కీ నష్టాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు సైతం శుక్రవారం ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాలనే నమోదు చేశాయి.
రూపాయి బలహీనం
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ శుక్రవారం బాగా బలహీనపడింది. 52 పైసలు నష్టపోయిన రూపాయి ఇంట్రాడేలో 69.58 రూపాయలుగా ట్రేడైంది. ఇక ముడిచమురు ధరలు మాత్రం 2.28 శాతం పెరిగి బ్యారెల్ 61.88 డాలర్ల వంతున ట్రేడైంది.