బిజినెస్

భారీగా నష్టపోయిన ‘కాఫీడే’ వాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 2: కేఫ్ కాఫీడే ఎంటర్‌ప్రైజెస్ స్టాక్స్ గడచిన నాలుగు రోజుల్లో భారీ నష్టాలపాలయ్యాయి. వ్యవస్థాపక చైర్మన్ వీజీ సిద్ధార్థ అదృశ్యమై, కర్నాటకలోని మంగళూరుకు సమీపంలో గల నేత్రావతీ నదీతీరంలో శవమై కనిపించడంతో స్టాక్ మార్కెట్‌లో ఆ కంపెనీ వాటాలు ఎన్నడూ లేనంతంగా తీవ్ర అమ్మకాల వత్తిడికి గురయ్యాయి. బీఎస్‌ఈలో నాలుగు రోజులుగా కంపెనీ మార్కెట్ విలువ సైతం రూ. 2,110.40 కోట్ల నుంచి 1,956.6 కోట్లకు పడిపోయింది. శుక్రవారం మాత్రమే ఈ కంపెనీ వాటాలు 9.96 శాతం నష్టపోయి 52 వారాల కనిష్టానికి చేరి ఒక్కోవాటా రూ. 99.45 వంతున ట్రేడైంది. కేఫ్ కాఫీడే ఎంటర్‌ప్రైజెస్ స్వతంత్ర డైరెక్టర్ ఎస్‌వీ రంగనాథ్‌ను మధ్యంతర (తాత్కాలిక) చైర్మన్‌గా బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఐనా ఈ పరిణామం వరుస నష్టాలకు అడ్డుకట్ట వేయలేకపోయింది. కాగా దివంగత వ్యవస్థాపక చైర్మన్ సిద్ధార్థ తీవ్ర అప్పుల ఒత్తిడి కారణంగానే బలవన్మరణానికి పాల్పడ్డారని తేటతెల్లమమైంది. ఆస్తులకన్నా రెండు రెట్లు అధికంగా రూ. 5,200 కోట్లమేర రుణాలు తీసుకుని హోటళ్లు, స్థిరాస్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టి అక్కడ కూడా అప్పులు పెరిగిపోయాయని, అందువల్లే సిద్ధార్థ మానసిక వ్యథకు గురయ్యారని స్టాక్ ఎక్చేంజీలు, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఫైలింగ్‌ల ద్వారా తెలియవచ్చింది.