బిజినెస్

ఫోన్‌పే ద్వారా గత జూలైలో 335 మిలియన్ల లావాదేవీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఆన్‌లైన్ వాణిజ్య సంస్థ ‘్ఫ్లప్‌కార్ట్’ నిర్వహణలోని ‘్ఫన్‌పే’ మొత్తం 95 బిలియన్ డాలర్ల వార్షిక చెల్లింపుల విలువ (టీపీవీ) రన్ రేటును సాధించినట్టు శుక్రవారం నాడిక్కడ తెలిపింది. కేవలం జూలై నెలలోనే 335 మిలియన్ల లావాదేవీలు ‘్ఫన్‌పే’ ద్వారా జరిగాయని వెల్లడించింది. గత ఏడాది జూన్‌లో 20 బిలియన్ డాలర్ల మార్కును దాటినప్పటికే ఫోన్‌పే టీపీవీ రన్‌రేటు 5ఎక్స్ స్థాయికి వృద్ధి చెందిందని కంపెనీ తెలిపింది. ఫోన్‌పే వాణిజ్య నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారానే ఇది సాధ్యమైందని ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సమీర్ నిగమ్ తెలిపారు. కాగా గూగుల్ పే, అమెజాన్ పే, పేటీఎమ్ తరహాలోనే మనదేశ డిజిటల్ చెల్లింపుల విభాగంలో ఫోన్‌పే ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఈక్రమంలో సింగపూర్‌కు చెందిన ఫోన్‌పే (గతంలో ఫ్లిప్‌కార్ట్ పేమెంట్స్) ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నుంచి 698 కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందుకుంది. కాగా దేశంలో ఫోన్‌పేకు వస్తున్న ఆదరణ తమకు మరింత ప్రోత్సాహాన్నిస్తోందని సీఈవో సమీర్ నిగమ్ తెలిపారు. తమ యాప్‌ను దేశంలోని 60 మిలియన్లమంది వినియోగిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రతి 15 మంది భారతీయ పౌరుల్లో ఒకరు తమ యాప్‌నకు వినియోగదారులుగా ఉన్నారని ఆయన తెలిపారు. కేవలం మూడేళ్ల క్రితం ఏర్పాటైన తమ కంపెనీకి బెంగళూరు ప్రధాన కార్యాలయ పరిధిలో 150 మిలియన్ల మంది వినియోగదారులు ఏర్పడ్డారని తెలిపారు. అలాగే 50 లక్షల వాణిజ్య ఔట్‌లెట్లను ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ద్వారా భారతీయ వినియోగదారులు ఆదరిస్తున్నారని ఆయన వివరించారు.