బిజినెస్

టీవీ ప్యానెళ్లపై దిగుమతి సుంకాలను తగ్గించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 2: దిగుమమతి సుంకాలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ వినిమయ వస్తువుల సంస్థ ‘టీసీఎల్ ఎలక్ట్రానిక్స్’ శుక్రవారం విజ్ఞప్తి చేసింది. తిరుపతిలో రూ. 2,000 కోట్ల పెట్టుబడులతో సరికొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ప్రత్యేకించి ఓపెన్ సెల్ టెలివిజన్ ప్యానెల్స్ దిగుమతిపై విధిస్తున్న సుంకాలపై పునఃపరిశీలన చేయాలని టీసీఎల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. టెలివిజన్ విభాగంలో మన దేశంలో రెండో తయారీ కేంద్రాన్ని వచ్చే మూడేళ్లలో నెలకొల్పాలన్న కృతనిశ్చయంతో ఉన్న ఈ సంస్థ ‘తాము దేశీయంగా తమ బ్రాండ్‌ను విస్తరించడం ద్వారా తయారీ రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నామని పేర్కొంది. ప్రభుత్వ మేకిన్ ఇండియా నినాదం సాకారం కావాలంటే ప్రస్తుతం విధిస్తున్న సుంకాలు, సెస్సు లు, ఇతర చార్జీలు తగ్గించాలని టీసీఎల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మైక్ చెన్ పీటీఐతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఇలాచేస్తే విశిష్టమైన బ్రాండ్లు దేశీయంగా తయారవడంతోబాటు సరికొత్త సాంకేతికత, పెట్టుబడుల వృద్ధికి దోహదం కలుగుతుందన్నారు. తమ కంపెనీ టెలివిజన్ ప్యానళ్లను సులభంగా అసెంబుల్ చేయడానికి వీలుగా ఓపెన్‌సెల్ పద్ధతిలో దిగుమతి చేసుకోవడం జరుగుతుందని, ప్రస్తు త సుంకాల వల్ల మార్కెట్లోకి టెలివిజన్ వచ్చే సమయానికి అధిక ధరలు నిర్ణయించక తప్పని పరిస్థితి ఉందన్నారు. భారత టీవీ మా ర్కెట్‌లో టీసీఎల్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. జీఎఫ్‌కే గణాంకా ల ప్రకారం గడచిన జూన్ మాసానికి ఈ కంపెనీ మనదేశ మార్కెట్లో 5.3 శాతం వాటాను ఏర్పరచుకుంది. వచ్చే మూడేళ్లలో రెండో స్థానాన్ని ఆక్రమించాలన్న లక్ష్యం ఉందని చెన్ తెలిపారు. గత ఏడాది టీసీఎల్ 3.5 లక్షల ఎల్‌ఈడీ టీవీలను విక్రయించింది. ఈ ఏడాది ఇప్పటికే ఆ స్థాయిలో విక్రయాలు జరిగాయన్నారు. దేశంలో రెండు రకాల బ్రాండ్లను టీసీఎల్ మార్కెటింగ్ చేస్తోంది. ఇందులో టీసీఎల్, ఐఫ్ఫాల్కాన్ ఉన్నాయి. కాగా తమ కంపెనీ అమెజాన్ ద్వారా విక్రయాల్లో మూడో స్థానంలో, ఫిప్‌కార్ట్ ద్వారా విక్రయాల్లో నాల్గవ స్థానంలో ఉందని, ప్రస్తుతం ఉన్న 32 ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ ఔట్‌లెట్లను వచ్చే మార్చి నాటికి 100కు పెంచుతామని చెన్ తెలిపారు.