బిజినెస్

ఆత్మహత్యలు సరికాదు వాణిజ్య సమస్యలు జటిలమైనపుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : వాణిజ్యపరమైన వైఫల్యాలకు భయపడి ప్రాణత్యాగం లాంటి దౌర్బల్య మనస్తత్వ చర్యలకు దిగడం సరికాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హితవుపలికారు. కేఫ్ కాఫీడే అధినేత వీజీ సిద్ధార్థ ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆమె ఉదహరించారు. దివాళా, బ్యాంకుల మోసాల నియంత్రణ చట్టం (ఐబీసీ)పై లోక్‌సభలో గురువారం జరిగిన చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి ప్రసంగించారు. పారిశ్రామిక, వ్యాపారవేత్తలు సమస్యలు తలెత్తిన సందర్భాల్లో సంయమనంతో వ్యవహరించి పరిష్కరించుకోవాలని, ఇందుకోసం ఐబీసీ కోడ్ వంటి వాటిని వినియోగించుకునేందుకు కృషి చేయాలని, ఒకవేళ వీలుకానిపక్షంలో మర్యాద పూర్వకంగా తప్పుకోవాలని నిర్మల సూచించారు. మనదేశంలో వాణిజ్యపరమైన వైఫల్యాలు పలుమార్లు అనివార్యంగాను, తక్కువ చేసి చూడలేనంతగానూ చోటుచేసుకుంటున్నాయన్నారు. అలాంటి సందర్భాల్లో కంపెనీల యజమానులు మర్యాద పూర్వకంగా తప్పుకునేందుకు సవరించిన ఐబీసీ చట్టం వెసులుబాటు కల్పిస్తుందన్నారు. కేఫ్ కాఫీడే యజమాని సిద్ధార్థ మృతదేహం కర్నాటకలోని నేత్రావతి నదీ తీరంలో బుధవారం కనిపించిన సంగతి తెలిసిందే. ఆయన రాసిన లేఖలో ఆదాయ పన్నుశాఖ అధికారుల వేధిపులను వివరించగా, దాన్ని సంబంధిత అధికారులు ఖండించడం జరిగింది. ఈక్రమంలో లోక్‌సభలో తెలుగుదేశం సభ్యుడు గల్లా జయదేశ్ మాట్లాడుతూ దేశ ఆర్థికాభివృద్ధి స్థితిగుతులు, వ్యాపార రంగంలో ఒడిదుడుకులు కొన్నిసార్లు వాణిజ్య వైఫల్యాలకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు. ఈవిషయంలో బ్యాంకులు మరింత బాధ్యతాయుతంగా మసలుకునేలా వ్యవస్థను క్రమబద్ధీకరించాలని సూచించారు. ఓ పారిశ్రామికవేత్త రుణం తీసుకునేందుకు ఇచ్చే వ్యక్తిగత హామీ పలు సందర్భాల్లో ఆత్మహత్యల వంటి విపరీత పరిణామాలకు దారితీస్తోందన్నారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నవారంతా ఖచ్చితంగా తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బీజేడీ సభ్యుడు పినాకినీ మిశ్రా మాట్లాడుతూ కేఫ్ కాఫీడే వ్యవస్థాపక చైర్మన్ సిద్ధార్థ బలవన్మరణ ఉదంతం దురదృష్టకరమన్నారు. దివాళా నివారణ చట్టాన్ని సక్రమంగా వినియోగించి ఇలాంటి ఘటనలను నియంత్రించాలని, అప్పుడే 5 బిలియన్ డాలర్ల ఆర్థికాభివృద్ధి లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలుంటుందని పేర్కొన్నారు.