బిజినెస్

మహిళలకు నైట్ షిఫ్ట్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజి, ఆగస్టు 1: పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న మహిళలు రాత్రి వేళల్లోనూ పని చేయడానికి వీలు కల్పిస్తున్న ఒక బిల్లును గోవా అసెంబ్లీ గురువారం ఆమోదించింది. ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ యాక్ట్‌కు సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ఈ బిల్లును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్ కవ్‌లేకర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. అయితే, మహిళా ఉద్యోగులను నైట్ షిఫ్ట్‌లో పని చేయవలసిందిగా ఒత్తిడి చేయడానికి వీలులేదని చంద్రకాంత్ కవ్‌లేకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతాప్ సింగ్ రాణే, అలెక్సో రెగినాల్డో లౌరెంకో, రవి నాయక్, ఎంజీపీకి చెందిన సుదిన్ ధావలికర్ సహా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఈ బిల్లును సెలక్షన్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశారు. మహిళలు రాత్రి షిఫ్టుల్లో పనిచేయలేక పోవడం వల్ల వారు చాలాసార్లు పదోన్నతులు పొందలేకపోతున్నారని పేర్కొంటూ కవలేకర్ ఈ బిల్లును సమర్థించారు. ‘కేవలం ప్రైవేటు ఇండస్ట్రీలోనే (మహిళలకు రాత్రి షిఫ్టులు వేయడంపై ఇప్పటి వరకు) నిషేధం ఉన్నది. ఎయిర్‌పోర్ట్, హాస్పిటాలిటి వంటి ఇతర రంగాలలో ఇలాంటి నిషేధం లేదు’ అని కవ్‌లేకర్ పేర్కొన్నారు. ‘ఈ బిల్లు మహిళా ఉద్యోగులకు పురుషులతో సమానత్వాన్ని కల్పిస్తుంది. వారి పని గంటలను మనము నియంత్రించజాలము. మనము విశాల దృక్పథంతో అలోచించ వలసిన అవసరం ఉన్నది’ అని ఉప ముఖ్యమంత్రి అన్నారు. అయితే, మహిళలకు రాత్రి షిఫ్టులు వేయాలంటే వారి అంగీకారం తీసుకోవడం తప్పనిసరని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ నుంచి అనుమతి తీసుకోవడం కూడా తప్పనిసరని, మహిళా ఉద్యోగుల అభీష్టానికి వ్యతిరేకంగా వారిపై ఎవరు కూడా రాత్రి షిఫ్టుల్లో పనిచేయాలని ఒత్తిడి చేయజాలరని ఆయన అన్నారు.