బిజినెస్

ఐదు నెలల కనిష్టానికి స్టాక్ మార్కెట్ సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 1: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం మళ్లీ భారీ నష్టాలపాలై ఐదు నెలల కనిష్టానికి పడిపోయాయి. బుధవారం స్వల్పలాభాల్లోకి వచ్చిన తర్వాత మళ్లీ నష్టాల పరంపరలోకి దిగజారడం ఆందోళనకర పరిణామం. కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతోబాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం గురువారం 25 బేసిస్ పాయింట్ల మేర రేట్ల కోత విధించిన వెంటనే ఆ కమిటీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు దేశ, అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. తొలుత బలహీనంగానే ఆరంభమైన వాణిజ్యం తర్వాత పుంజుకుంది. మధ్యాహ్నానికి సెనె్సక్స్ ఏకంగా 750 పాయింట్లు ఎగబాకింది. అయితే మారిన అంతర్జాతీయ పరిస్థితులతో మళ్లీ నేల చూపులు చూసి నష్టాల్లోకి జారుకుంది. మొత్తం 462.80 పాయింట్లు నష్టపోయిన ఈ బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ 1.24 శాతం నష్టాలతో 37,018.32 పాయింట్ల దిగువన స్థిరపడింది. బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 138 పాయింట్లు కోల్పోయి 1.24 శాతం నష్టాలతో కీలక 11,000 మార్కుకన్నా దిగువ స్థాయి 10.980.00 వద్ద స్థిరపడింది. గత మార్చి నెలనుంచి కీలక సూచీలు రెండూ ఇలా అతి కనిష్టస్థాయిని నమోదు చేయడం ఇదే తొలిసారి. ప్రధానంగా కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు విదేశీ పెట్టుబడులను ఆర్షించేంతగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణమని విశే్లషకులు భావిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లకు ఊతమిచ్చేలా అమెరికా ఫెడరల్ రిజర్వు ద్రవ్య వినిమయ కమిటీ సమావేశం దశాబ్ధ కాలం తర్వాత తొలిసారిగా రుణాలపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు కోత విధించిన సంగతి తెలిసిందే. ఐతే ఇది తదుపరి వరుస రేట్ల కోత వలయానికి సంకేతం కాదని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ స్పష్టం చేయడంతో మదుపర్ల ఆశలపై నీళ్లు చల్లిన చందంగా మారింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడిందని వాణిజ్య రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇలావుండగా సెనె్సక్స్ ప్యాక్‌లో వేదాంత అత్యధికంగా 5.55 శాతం నష్టపోయింది. అలాగే టాటామోటార్స్, ఎస్‌బీఐ, ఎస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్ 4.50 శాతం నష్టాలను చవిచూశాయి. మరోవైపు మారుతి, పవర్‌గ్రిడ్, రిలయన్స్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, హెచ్‌యూఎల్, ఎన్‌టీపీసీ 1.86 శాతం లాభపడ్డాయి. కాగా బుధవారం మార్కెట్ వేళల తర్వాత విడుదలైన గణాంకాల మేరకు ఎనిమిది కీలక పరిశ్రమల వృద్ధిరేటు జూన్‌లో 0.2 శాతం పడిపోయిందని స్పష్టం చేసింది. ఇందుకు ప్రధాన కారణం చమురు, సిమెంట్ ఉత్పత్తిలో మందగమనమేనని తెలిపింది. అలాగే ప్రభుత్వ వార్షిక ద్రవ్య లోటు జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 4.32 లక్షల కోట్లకు చేరింది. 2019-20 బడ్జెట్ అంచనాల్లో ఇది 61.4 శాతం కావడం గమనార్హం. ప్రధానంగా దిగ్గజ వాహన తయారీ కంపెనీలు గురువారం నిరాశాజనకమైన జూలై నెల విక్రయాల గణాంకాలను వెల్లడించాయి. ఈక్రమంలో వినియోగదారుడి సెంటిమెంట్ ఇంకా ప్రతికూలంగానే ఉందన్న విషయం తేటతెల్లమైంది. కేంద్ర తాజా బడ్జెట్ సమావేశాల అనంతరం గడచిన నెల రోజులుగా విదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు 3 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను భారతీయ స్టాక్‌మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. వరుస ఆర్థికాభివృద్ధి లోటు, అధిక పన్నుల విధానం ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి అమెరికా ఫెడ్ చైర్మన్ ప్రకటన అగ్నికి ఆజ్యంలా తోడైందని అంటున్నారు. ప్రధానంగా కేపిటల్ మార్కెట్లకు ఆర్థిక సాయం ఉండదని పేర్కొనడం మదుపర్లను నిరాశపరిచింది. నిఫ్టీ పరిధిలోని కంపెనీలు లాభాల్లో మరింత తగ్గుదలను చవిచూసే అవకాశాలున్నాయని సీనియర్ విశే్లషకుడు జగన్నాథం తునుగుంట పేర్కొన్నారు. కాగా చైనా ఫ్యాక్టరీల ఫలితాలు నిరాశకు గురిచేయడంతో బీఎస్‌ఈలో లోహ స్టాక్స్ అత్యధికంగా 3.37 శాతం నష్టాలను చవిచూడగా, వౌలిక లోహాలు 2.49 శాతం, టెలికాం 2.35 శాతం, టెక్ 2.07 శాతం, సమాచార సాంకేతిక రంగం 1.92 శాతం, బ్యాంకెక్స్ 1.80 శాతం, కేపిటల్ గూడ్స్ 1.75 శాతం, పారిశ్రామిక రంగం 1.66 శాతం, ఆర్థిక రంగం 1.62 శాతం, స్తిరాస్థి రంగం 1.01 శాతం, హెల్త్‌కేర్ 0.92 శాతం, చమురు, సహజ వాయులు 0.47 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.45 శాతం నష్టపోయాయి. మరోవైపు విద్యుత్, వినిమయ వస్తువుల 0.51 శాతం లాభపడ్డాయి.
రూపాయి బలహీనం
అమెరిన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గురువారం 26 పైసలు తగ్గి ఇంట్రాడేలో రూ. 69.06గా ట్రేడైంది. అలాగే ముడిచమురు ధరలు 1.05 శాతం తగ్గి బ్యారెల్ 64.37 డాలర్లు పలికింది. ఇక ఆసియా మార్కెట్లలో షాంఘై కాంపోజిట్ సూచీ, హ్యాంగ్‌సెంగ్, కోస్పి నష్టాల్లో ముగియగా, నిక్కీ మాత్రం లాభపడింది. ఐరోపా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.