బిజినెస్

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పదవి భర్తీకి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ పదవికి అర్హులైనవారు దరఖాస్తులు పంపాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. విరాల్ ఆచార్య ఆ పదవికి రాజీనామా చేయడంతో అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంటోంది. పదవీ కాలం ఇంకా ఆరు నెలలు ఉండగానే విరాల్ ఆచార్య వైదొలిగిన సంగతి తెలిసిందే. కాగా మూడేళ్ల కాల వ్యవధిగల డిప్యూటీ గవర్నర్ పదవికి అర్హులు దరఖాస్తు చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. దరఖాస్తుదారులకు గడచిన జూలై 24 నాటికి 60 ఏళ్ల వయసు మించరాదని, ప్రభుత్వ పాలనా విభాగం (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్)లో కనీసం 25 ఏళ్ల అనుభవం కలిగిన వ్యక్తులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులుగా లేదా తత్సమాన హోదాలో పనిచేసిన వ్యక్తులు దరఖాస్తు చేయవచ్చని మంత్రిత్వ శాఖ కోరింది. అలాగే దేశీయ, లేదా అంతర్జాతీయ ప్రభుత్వ ఆర్థిక సంస్థల్లో 25 ఏళ్లు పనిచేసిన వ్యక్తులు కూడా అర్హులని తెలిపింది. జీతభత్యాలు తొలుత రూ. 2.25 లక్షల వరకు (లెవెల్ 17) కింద ఉంటాయని తెలిపింది. ఈనెల 19వ తేదీలోగా అర్హులైనవారు దరఖాస్తులు చేయాలని సూచించింది. ఆర్థిక రంగ నియంత్రణ, నియామకాల సెర్చ్ కమిటీ (ఎఫ్‌ఎస్‌ఆర్‌ఏఎస్‌సీ)కి అర్హులను గుర్తించి ఈ పదవికి సిఫార్సు చేసే పూర్తి అథికారాలు ఉంటాయని ఆ ప్రకటన తెలిపింది. దరఖాస్తు చేయని వ్యక్తులను సైతం మెరిట్ ప్రాతిపదికన ఈ కమిటీ ఎంపిక చేసే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. అలాగే అర్హతలు, ఇతర నిబంధనలను సడలించే అధికారం కూడా ఆ కమిటీకి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంతదాస్, డిప్యూటీ గవర్నర్లుగా ఎన్‌ఎస్ విశ్వనాథన్, బీపీ కానుంగో, ఎంకే జైన్ కొనసాగుతున్నారు.