బిజినెస్

అంతర్జాతీయ స్మార్ట్ఫోన్ల ఎగుమతిలో 1.2 శాతం తగ్గుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అంతర్జాతీయంగా స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో 1.2 శాతం తగ్గుదల నెలకొంది. గడచిన జూన్ మాసంతో ముగిసిన త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్తంగా 360 మిలియన్ యూనిట్ల ఎగుమతులు జరిగింది. ఈక్రమంలో వరుసగా ఏడు త్రైమాసికాలుగా ఈ రవాణాలో తగ్గుదల చోటుచేసుకుందని బుధవారం ఇక్కడ విడుదలైన అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ‘కౌటర్‌పార్ట్’ అధ్యయన నివేదిక వెల్లడించింది. 2018లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొత్తం 364.3 మిలియన్ యూనిట్ల స్మార్ట్ఫోన్ల ఎగుమతులు జరుగ్గా, ఈ ఏడాది అదే త్రైమాసికంలో తగ్గుదల చోటుచేసుకోవడానికి ప్రధానంగా చైనాలో విక్రయాలు గణనీయంగా తగ్గడమే కారణమని నివేదిక పేర్కొంది. గత రెండేళ్ల నుంచి ఆ దేశంలో స్మార్ట్ఫోన్ల విక్రయాలు తగ్గాయని తెలిపింది. ప్రపంచ దేశాల మొత్తం స్మార్ట్ఫోన్ల తయారీలో దాదాపు నాలుగింట ఓ వంతు ఫోన్లు చైనాలోనే తయారవుతుంటాయని, అలాగే అదే స్థాయిలో ఎగుమతులూ జరుగుతుంటాయని, ఐతే సంవత్సరాల ప్రాతిపదికన పరిశీలిస్తే తాజా త్రైమాసికంలో దాదాపు 9 శాతం తగ్గుదల నెలకొందని నివేదిక పేర్కొంది. హవాయ్ మార్కెట్‌ను సాకుగా చూపించి ముదిరిన అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం గడచిన త్రైమాసికంలో అంతర్జాతీయ స్మార్ట్ఫోన్ల వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపిందని తెలిపింది. ఈ ఫోన్ల ఎగుమతిలో భారత్‌కూడా గణనీయంగా వృద్ధిచెందుతోందని, అక్కడ మార్కెట్ కీలకంగా మారుతోందని అధ్యయనం తేల్చింది. తాజా త్రైమాసికంలో రికార్డు స్థాయిలో దాదాపు 37 మిలియన్ యూనిట్ల స్మార్ట్ఫోన్లను అదనంగా భారత్ ఎగుమతులు చేసిందని పేర్కొంది. చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ పరికరాల దిగ్గజం హవాయ్‌పై గత మే నెల నుంచి అమెరికా నిషేధం విధించినప్పటికీ హవాయ్ 4.6 శాతం అదనపు ఎగుమతులను గడచిన త్రైమాసికంలో చేయగలిగిందని, అంతర్జాతీయంగా 16 శాతం మార్కెట్ షేర్‌ను కైవసం చేసుకోగలిగిందని నివేదిక తెలిపింది. దీన్నిబట్టి భవిష్యత్తులో కూడా హవాయ్ బ్యాన్ ప్రభావం అంతర్జాతీయంగా అంతగా ఉండకపోవచ్చని కౌంటర్ పాయింట్ పరిశోధనా విభాగం అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాతక్ అభిప్రాయపడ్డారు. దేశీయంగా మార్కెట్‌ను వృద్ధి చేసుకునేందుకు హవాయ్ రాబోయే రోజుల్లో ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందని ఆయన తెలిపారు. అయితే అంతర్జాతీయ ఎగుమతులకు ఈ పరిణామం ఊతం ఇవ్వబోదని, ఇందువల్ల ప్రస్తుతం నెలకొన్న ఈ లోటును ఇతర ఓరిజినల్ పరికరాల తయారీ సంస్థలు భర్తీ చేసేందుకు అవకాశాలున్నాయని తెలిపింది. ప్రత్యేకించి శ్యామ్‌సంగ్ ఈ అవకాశాని అందిపుచ్చుకోవచ్చని నివేదిక తెలిపింది. అలాగే రాబోయే 5జీ వ్యవస్థ కూడా కొంతమేర లోటును పూడ్చవచ్చని కౌంటర్ పాయింట్ అంచనా వేసింది. 2019లో 5జీ డివైస్‌లు 20 మిలియన్ల వరకు విక్రయాలు జరిగే అవకాశాలున్నాయని తెలిపింది. భారీగా వివిధ విభాగాల్లోకి ఈ నెట్‌వర్క్ విస్తరించే అవకాశాలున్నాయని కౌంటర్ పాయింట్ పరిశోధనా విభాగం విశే్లషకుడు వరుణ్ మిశ్రా తెలిపారు. కాగా గడచిన త్రైమాసికంలో శ్యామ్‌సంగ్ అత్యధికంగా 76.6 మిలియన్ యూనిట్ల ఎగుమతులతో అగ్ర స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో హవా య్ (56.7 మిలియన్ యూనిట్ల ఎగుమతితో) నిలిచింది. యాపెల్ 36.4 మిలియన్ యూనిట్లు ఎగుమతి చేసింది. మొత్తం మార్కెట్‌లో హవాయ్‌కి చెం దిన ఒప్పో, వివో, షియోమీ, రీల్మ్ సంయుక్త మార్కె ట్ 42 శాతం ఆక్రమించాయని నివేదిక తెలిపింది.