బిజినెస్

అపోలో టైర్స్ త్రైమాసిక లాభాల్లో 44 శాతం తగ్గుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: అపోలో టైర్స్ నికర లాభాల్లో తాజాత్రైమాసికంలో 43.77 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. గత జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభాలు రూ.141.6 కోట్లకు తగ్గాయని ఆ కంపెనీ పేర్కొంది. గడచిన ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 251.84 కోట్ల రూపాయల నికర లాభం సమకూరిందని వివరించింది. అలాగే మొత్తం ఆదాయంలో మాత్రం స్వల్పంగా వృద్ధి చోటుచేసుకుని రూ. 4,356.78 కోట్లకు పెరిగిందని కంపెనీ వివరించింది. గడచిన ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 4,328.6 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని తెలిపింది. వాహనాల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం వల్ల, ప్రత్యామ్నాయ ఉత్పత్తులు పెరగడం వల్ల ఈ పరిస్థితులు నెలకొన్నాయని కంపెనీ చైర్మన్ ఓంకార్ ఎస్ కన్వార్ బుధవారం ఇక్కడ జరిగిన కంపెనీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు. వచ్చే పండుగ సీజన్ దృష్ట్యా విక్రయాల్లో వృద్ధి, మార్కెట్లో డిమాండ్ చోటుచేసుకునే అవకాశాలున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పరిశ్రమ ఎదుర్కొంటున్న పరిస్థితులకు భిన్నంగా ఆశావహ దృక్పథంతో తమ సంస్థ పనిచేస్తోందన్నారు. హంగరీలో సరికొత్త ప్రాజెక్టులో తమ కంపెనీ రూ. 4000 కోట్లు మదుపుచేసిందని, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టులో రూ.3,800 కోట్లు పెట్టుబడిపెడుతోందని తెలిపారు. చెన్నైలోప్రస్తుతం ఉన్న తయారీ యూనిట్‌ను ట్రక్ టైర్ రేడియల్ ఉత్పత్తిని 6000 యూనిట్ల నుంచి 12 వేల యూనిట్లకు విస్తరించే నిమిత్తం చర్యలు చేపట్టామన్నారు. దేశంలో ఇప్పటికే బహుళ విభాగాల్లో నాయకత్వ స్థానంలో ఉన్నామని, అలాగే భవిష్యత్తులో ఐరోపాకు వాణిజ్యాన్ని విస్తరించాలన్న లక్ష్యం ఉందని తెలిపారు.