బిజినెస్

‘కాఫీడే’ వ్యవస్థాపక చైర్మన్ సిద్దార్థ అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 30: కాఫీడే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు చెందిన వాటాలు మంగళవారం 20 శాతం నష్టపోయాయి. కంపెనీ మొత్తం మార్కెట్ విలువ రూ. 813 కోట్లకు చేరింది. ఆ కంపెనీ వ్యవస్థాపక చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీజీ సిద్దార్థ అదృశ్యమయ్యారన్న వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలోని ఆ కంపెనీ వాటాలపై ప్రభా వం పడింది. ఈ వాటాలు మొత్తం 19.99 శాతం నష్టపోయి ఒక్కో వాటా విలువ రూ.154.05కు చేరింది. ఇది 52 వారాల కనిష్ట స్థాయి కావడం బీఎస్‌ఈలో ఇంతటి కనిష్ట స్థాయిని ఈ గతంలో ఎన్నడూ నమోదు చేయకపోవడం గమనార్హం. ఎన్‌ఎస్‌ఈలో ఈ వాటాల విలువ 20 శాతం తగ్గి ఏడాది కనిష్ట స్థాయిలో ఒక్కోవాటా రూ. 153.40కు చేరింది. అలాగే బీఎస్‌ఈలో కంపెనీ మార్కెట్ విలువ సైతం రూ. 3,254.33 కోట్ల నుంచి రూ. 812.67 కోట్లకు పడిపోయింది. సుమారు రెండు నెలల కాలంగా ఈ కంపెనీ వాటాలు నష్టాల బాటలో సాగుతూ తాజాగా 52 వారాల కనిష్టానికి చేరుకుంది. ఈక్రమంలో కంపెనీ వ్యవస్థాపకుడు అదృశ్యమవడం గొడ్డలిపెట్టుగా మారింది. ప్రత్యేకించి ఆయన వదిలివెళ్లిందిగా చెబుతున్న లేఖలో కంపెనీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్టుగా స్పష్టం చేసినట్టు తెలిసింది. ‘స్టాక్స్‌లో వాటాలు రెండంకెల స్థాయిని తిరిగి అందుకునేలా కృషి చేస్తామన్న ధీమాను కేపిటల్ ఎయిమ్ పరిశోధనా విభాగం అధిపతి రమేష్ తివారి, శామ్‌కో సెకూరిటీస్ పరిశోథనా విభాగం అధిపతి ఉమేష్ మెహతా ధీమా వ్యక్తం చేశారు. తమ కంపెనీది సత్యం కంపూర్స్ అంతటి తీవ్ర స్థాయిది కాదన్నారు. కంపెనీకి చెందిన కీలక వ్యక్తి అదృశ్యమైనప్పటికీ నిఫ్టీ తీవ్ర స్థాయిలో నష్టపోలేదని గుర్తు చేశారు. బీఎస్‌ఈలో తలెత్తిన నష్టాలను పూడ్చేందుకు చర్యలు చేపడతామన్నారు. సోమవారం సాయంత్రం నుంచి కంపెనీ చైర్మన్, ఎండీ వీజీ సిద్దార్థ కనిపించడం లేదని, ఆయన ఆచూకీ కనుగొనేందుకు అధికారుల సహకారాన్ని తీసుకుంటున్నామని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
అదృశ్యానికి పూర్వాపరాలు
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణకు సిద్దార్థ మేనల్లుడు. సిద్దార్థ సకలేష్‌పూర్ వైపు తరలివెళ్లారని, మార్గమధ్యంలో మంగళూరు వైపు మళ్లాల్సిందిగా డ్రైవర్‌ను ఆదేశించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దక్షిణ కన్నడ జిల్లా కోటెపురా ప్రాంతంలోని నేత్రావతి నది వద్ద బ్రిడ్జిని చేరుకున్న తర్వాత సిద్దార్థ కారు నుంచి దిగిపోయారని, తాను వాకింగ్‌కు వెళుతున్నానని అక్కడే ఆగమని డ్రైవర్‌కు సూచించిన సిద్దార్థ రెండు గంటలైనా తిరిగి రాకపోవడంతో కారు డ్రైవర్ పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశారని దక్షిణ కన్నడ జిల్లా పోలీసు డిప్యూటీ కమిషనర్ సెందిల్ శశికాంత్ సెందిల్ పీటీఐకి వివరించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం సైతం నేత్రావతి నదీ పరీవాహక ప్రాంతాల్లో సిద్దార్థ కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టింది. ఇలావుండగా తాను స్థాపించిన కాఫీడే ఎంటర్‌ప్రైజెస్ బోర్డ్ ఆఫ్ డైరెక్లరు, ఉద్యోగులకు సిద్దార్థ రాసిన లేఖలో ‘తాను ఓ పారిశ్రామికవేత్తగా విఫలమయ్యాన’ని పేర్కొన్నారని, ఐతే ఆ లేఖ ఆయన రాసిందా కాదా నిర్థారించాల్సి ఉందని కంపెనీ అథికారులు తెలిపారు.