బిజినెస్

ఐదు నెలల కనిష్టానికి సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 30: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలతో కుదేలవుతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, వాహన, విద్యుత్ రంగ స్టాక్స్‌లో భారీగా అమ్మకాల వత్తిడి నెలకొనడంతో మంగళవారం సూచీలు పెద్దమొత్తాల్లో నష్టాలను నమోదు చేశాయి. కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశించిన విధంగా లేకపోవడం, మోటారు వాహన రంగంలో ఒడిదుడుకులు ప్రధానంగా మదుపర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని విశే్లషకులు పేర్కొంటున్నారు. సెనె్సక్స్ ఐదు నెలల కనిష్టానికి చేరింది. ఈ బీఎస్‌ఈ సూచీ 289.13 పాయింట్లు కోల్పోయి 0.77 శాతం నష్టాలతో 37,397.24 పాయింట్ల దిగువన స్థిరపడింది. అలాగే ఎన్‌ఎస్‌సీ సూచీ నిఫ్టీ సైతం 103.80 పాయింట్లు కోల్పోయి 0.93 శాతం నష్టాలతో 11,085.40 పాయింట్ల దిగువన స్థిరపడింది. తొలుత సానుకూలంగానే ఆరంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఆసియన్ మార్కెట్లు కోలుకోవడంతోబాటు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణాయక సమావేశం, చైనా-అమెరికా వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభం కావడం మంచి ఫలితాలకు దారితీయవచ్చన్న అంచనాలతో మదుపర్లు వాటాల కొనుగోళ్లకు ఉపక్రమించారు. దీంతో ఆరంభంలోనే 37,735.54 పాయింట్ల ఎగబాకి తర్వాత 37,950.21 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సెనె్సక్స్ ఆ తర్వాత నేలచూపులు చూసి అనూహ్యంగా 37,397.24 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. ఇలా తీవ్ర అమ్మకాల వత్తిడితో పరిస్థితి మొత్తం మారిపోయింది. సూచీలు ఊగిసలాటకు గురయ్యాయి. సెనె్సక్స్ ప్యాక్‌లో ఎస్ బ్యాంక్ భారీగా 9.13 శాతం నష్టపోయింది. అలాగే ఇండస్‌ఇండ్ బ్యాంక్ 6.66 శాతం, హీరోమోటోకార్ప్ 6.01 శాతం, సన్‌పార్మా 4.79 శాతం, ఎస్‌బీఐ 4.70 శాతం వంతున నష్టాలపాలయ్యాయి. అంతేగాక టాటా స్టీల్, వేదాంత, టాటామోటార్స్, రిలయన్స్, ఆక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ సైతం నష్టపోయాయి. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్ 3.19 శాతంతో అత్యధికంగా లాభపడింది. టీసీఎస్ 2.32 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.39 శాతం, ఐటీసీ 0.49 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.39 శాతం, హెచ్‌యూఎల్ 0.37 శాతం, ఎల్ అండ్ టీ 0.36 శాతం, పవర్‌గ్రిడ్ 0.24 శాతం, ఇన్ఫోసిస్ 0.16 శాతం, ఎన్‌టీపీసీ 0.08 శాతం వంతున లాభాలను సంతరించుకున్నాయి. ఇక రంగాలవారీగా చూస్తే బీఎస్‌ఈలో లోహ వాటాలు 3.25 శాతం నష్టపోయాయి. విద్యుత్ 2.42 శాతం, వౌలిక పరికరాలు 2.32 శాతం, చమురు, సహజ వాయువులు 2.14 శాతం, వాహన రంగం 2.12 శాతం, బ్యాంకెక్స్ 1.86 శాతం వంతున నష్టపోయాయి. కాగా అమెరికా-చైనా వాణిజ్య చర్చలు పునరావృతం, అమెరికన్ ఫెడ్ విధాన ఫలితాలపై దృష్టి సారించిన మదుపర్లు ఆచితూచి వ్యవహరించడం వల్లే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలపాలయ్యాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. 10 సంవత్సరాల బాండ్లకు సంబంధించిన లాభాల్లో తగ్గుదల నమోదైన దృష్ట్యా ద్రవ్య లభ్యత కోసం ఆర్బీఐ మరో 25 బేసిస్ పాయింట్ల మేర రేట్ల కోత విధించి ఆర్థిక స్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని ప్రముఖ విశే్లషకుడు వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. ఇలావుండగా విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం రూ. 704 కోట్ల విలువైన వాటాలను విక్రయించారు.
రూపాయి బలహీనం
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మంగళవారం 10 పైసలు తగ్గి ఇంట్రాడేలో 68.85 రూపాయలుగా ట్రేడైంది. ముడి చమురు ధరల్లో మాత్రం 0.82 శాతం పెరుగుదల నమోదై బ్యారెల్ 64.14 డాలర్ల వంతున ట్రేడైంది. ఆసియా మార్కెట్లు షాంఘై కాంపోజిట్ సూచీ, హ్యాంగ్‌సెంగ్, నిక్కీ, కోస్పి మంగళవారం లాభాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు ఆరంభ సెషన్‌లో స్థిరత్వాన్ని ప్రదర్శించాయి.