బిజినెస్

ఏపీలో పెట్టుబడులకు జపాన్ సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 29: నవ్యాంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పరస్పర వాణిజ్య సంబంధాలను మెరుగు పరుచుకునేందుకు జపాన్ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగా జపాన్ కాన్సుల్ జనరల్ కొజిరా ఉచియామా సామవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. ప్రభుత్వం తగిన భూమిని సమకూర్చితే డెడికేటెడ్ ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాసూటికల్స్, మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అభివృద్ధి చెందిన ఓడరేవులకు తగిన వౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో తోడ్పడేందుకు జపాన్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశంలో తూర్పు తీరంలో ఏపీని జపాన్ కంపెనీలు అత్యంత కీలకమైన ప్రదేశంగా గుర్తిస్తారని ఉచియామా వివరించారు. అదేవిధంగా జపాన్ భారతదేశంలోని 3వ అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారిగా ఉందని గుర్తుచేశారు. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఫిషరీస్ అండ్ ఫుడ్ జపాన్ (ఎంఏఎఫ్‌ఎఫ్) ప్రస్తుతం ల్యాండ్ స్కేప్ ఎనాలిసిస్ త్రూ మిజూహి ఇన్‌ఫర్మేషన్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్‌లో ఆహార ఉత్పత్తి, ఆహార శుద్ది, ఫిషరీస్ సెక్టార్‌లో మెరుగైన అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు.
రాష్ట్రంలో కోల్డ్‌స్టోరేజ్, వేర్ హౌసింగ్, సోర్సింగ్ కేంద్రాలు, అగ్రి ల్యాబ్స్, లాజిస్టిక్స్ టు కనెక్టివిటీ టు మార్కెటింగ్ ఇతర వౌలిక సదుపాయాలకు తోడ్పాటు నందించేందుకు జపాన్ పెట్టుబడిదారులు ఆసక్తి కనబరుస్తున్నట్లు చెప్పారు. సిస్టర్ స్టేట్ ఒప్పందం విత్ టొయోమా పెపెక్చర్‌లో భాగంగా గత 2015 అక్టోబర్ లో జపాన్, ఏపీ మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఆర్థిక, విద్యా, సాంస్కృతిక పర్యాటక రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ ఒప్పందంలో భాగంగా ఆంధ్ర విశ్వ విద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ విద్యార్థుల ఎక్సేంజ్ ప్రోగ్రామ్స్ ప్రోత్సాహానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. నూతన ప్రభుత్వ ప్రాధాన్యతల కనుగుణంగా గత ఒప్పందం అంశాలను ముందుకు తీసుకువెళ్లేందుకు చొరవ చూపుతామని ప్రకటించారు. భారత దేశంలోని వివిధ గ్రామీణ ప్రాంతాలకు చెందిన సుమారు 30వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చే లక్ష్యంతో జపాన్ ప్రభుత్వం జపాన్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ జపాన్ ఎండోవ్‌డ్ కోర్సెస్ (జేఈసీ)ని 2017లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌బీకేఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏర్పాటు చేయాలని కొందరు విద్యార్థులు జపాన్ నుండి ప్లేస్‌మెంట్లు కూడా పొందారని ఉచియామా సీఎస్‌కు వివరించారు. ఇండస్ట్రియల్ సెక్టార్‌లో మాన్యుఫ్యాక్చరింగ్ స్కిల్ ప్రమోషన్స్ ప్రోగ్రాం కింద జపాన్ భారత దేశాల మధ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని జపాన్ కౌనె్సల్ జనరల్ సీఎస్‌కు తెలిపారు. సీఎస్ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే జపాన్ కంపెనీలకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని పూర్తి తోడ్పాటు నందిస్తుందని హామీ ఇచ్చారు.