బిజినెస్

పోంజీ పథకాలపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : పేద, మధ్యతరగతి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి సొమ్ములు కూడబెడుతున్న గొలుసు స్కీంలకు(పోంజీ పథకాలు) కేంద్రం చెక్‌పెట్టింది. అలాంటి పథకాలను నిషేధిస్తూ తీసుకొచ్చిన ‘అన్‌రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్ బిల్లు-2019’ను పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది.
పోంజీ పథకాల నిషేధం బిల్లుకు రాజ్యసభ సోమవారం ఆమోదం తెలిపింది. బిల్లుకు ఈనెల 24న లోక్‌సభ ఆమోదం లభించింది. గొలుసు స్కీంలకు నిషేధిస్తూ తీసుకొచ్చిన ఆర్డినె్స స్థానే ప్రభుత్వం బిల్లును రూపొందించి ఆమోదం పొందింది. చిన్న, మధ్య తరగతి ఖాతాదారులకు రక్షణ కల్పించడమే బిల్లు ముఖ్య ఉద్దేశమని, పార్లమెంట్ ఉభయ సభలూ ఏకగ్రీవంగా ఆమోదించాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. బిల్లుపై జరిగిన చర్చలో మంత్రి పాల్గొంటూ ‘మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన బిల్లుకు మద్దతు ఇవ్వాలని సభ్యులందర్నీ మేం అభ్యర్థించాం’అని స్పష్టం చేశారు. కేంద్రం దీనిపై మంత్రులతో ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయనీ సందర్భంగా తెలిపారు. మంత్రుల బృందం సిఫార్సులు కొత్త చట్టంలో పొందుపరచనున్నచ్టు ఒక ప్రశ్నకు సమాధానంగా ఠాకూర్ పేర్కొన్నారు. జనం సొమ్ములు దోచుకున్న బడాబాబుల ముక్కుపిండి వాటిని వెనక్కి తీసుకురావడం బిల్లులో ఓ భాగమని ఆయన చెప్పారు. బిల్లులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారం కల్పించినట్టు మంత్రి వెల్లడించారు. మొత్తం 978 కేసులు గుర్తించగా అందులో అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 326 గుర్తించినట్టు ఆయన వివరించారు. అక్రమ డిపాజిట్లు, ఎగవేతలను కట్టడి చేయాలన్న ఉద్దేశంతోనే బిల్లును పకడ్బంధీగా రూపొందించామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలిపారు. ఇప్పటి వరకూ ఉన్న చట్టం లోపభూయిస్టంగా ఉండడంతో పేదలు, మధ్యతరగతి ఖాతాదారులు దోపిడీక గురయ్యారని ఆయన అన్నారు. బిల్లుపై జరిగిన చర్చలో పీ విల్సన్(డీఎంకే), నరేంద్ర జాదవ్(నామినేటెడ్), వీ విజయసాయిరెడ్డి(వైసీపీ), రామ్‌కుమార్ వర్మ(బీజేపీ), కేసీ రామమూర్తి(కాంగ్రెస్), అహ్మద్ హుస్సేన్ (టీఎంసీ), ఏ నవ్‌నీత్‌కృష్ణన్( అన్నాడీఎంకే), నరైన్ దాస్ గుప్తా(ఆప్), అజయ్ ప్రతాప్ సింగ్( బీజేపీ), కేవీపీ రామచందర్‌రావు(కాంగ్రెస్) పాల్గొన్నారు. సభ్యులందరూ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపారు.
చిత్రం...కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్