బిజినెస్

65 నగరాల్లో విద్యుత్ బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : దేశంలోని 65 నగరాల్లో నడిపేందుకు 5,645 విద్యుత్ బస్సులను కేంద్ర విద్యుత్ వాహనాల విభాగం ఇంటర్ మినీస్టీరియల్ కమిటీ మంజూరు చేసిందని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్ సోమవారం నాడిక్కడ తెలిపారు. వాతావరణ కాలుష్య నివారణకు ఇది ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) మండలి గతవారం సమావేశమై విద్యుత్ వాహనాలపై పన్నును 12 నుంచి 5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ సవరించిన పన్ను ఆగస్టు 1 నుంచి అమలులోకి రానుంది. ఈ క్రమంలో సోమవారం జరిగిన విద్యుత్ వాహనాల ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ సమావేశమై మొత్తం 8 రాష్ట్రాల్లోని 5,645 విద్యుత్ బస్సులను 65 నగరాలకు మంజూరు చేసింది. మోటారు వాహనాల రంగానికి ఇది ఎంతోప్రేరణగా నిలుస్తుందని, ప్రభుత్వ మేకిన్ ఇండియా నినాదం మేరకు నగరాలు పరిశుభ్రంగా మారడానికి అవకాశం కలుగుతుందని అమితాబ్ కాంత్ ట్విట్టర్ వేదికగా ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం 2019-20 బడ్జెట్‌లో విద్యుత్ వాహనాల కొనుగోలు నిమిత్తం తీసుకునే రుణాలపై అదనంగా 1.5 శాతం ఆదాయ పన్ను మినహాయింపును ప్రతిపాదించడం జరిగింది. అంతేకాక ఇప్పటికే విద్యుత్ వాహనాలకు సంబంధించిన కొన్ని విడిభాగాల దిగుమతిపై సుంకాన్ని సైతం మనహాయించిన సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల విద్యుత్ వాహనాల తయారీకి చెందిన ‘ఫేమ్ 2’ పథకానికి రూ. 10 వేల కోట్ల రూపాయలు కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకారాన్ని తెలిపిందని కాంత్ తెలిపారు. త్వరితగతిన ఈ వాహనాలను రూపొందించి సరికొత్త రాయితీలు, చార్జింగ్ వౌలిక వసతులను కల్పించేందుకు ఫేమ్ 2 పథకాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే. దేశంలో మొత్తం వాహనాల్లో 72 శాతం ద్విచక్ర వాహనాలున్నాయి. ఇందులో 150సిసి కంటే తక్కువ సామర్ధ్యం కలిగిన వాహనాలన్నింటి స్థానంలో 2025 మార్చి 31 నాటికి విద్యుత్ వాహనాలు ఉండాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుందని ఆయన పునరుర్ఘాటించారు. అలాగే త్రిచక్ర వాహనాలను సైతం 2023 మార్చి 31 తర్వాత కేవలం విద్యుత్ వాహనాలుగానే విక్రయించాలని నిర్ణయించుకున్న విషయాన్ని గుర్తు చేశారు.