బిజినెస్

అంతర్జాతీయ అగ్ర ఆవిష్కరణల ఆర్థిక శక్తుల జాబితాలోకి భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: గొప్ప పరిశోధనాత్మక ఆవిష్కరణల ఆర్థిక శక్తుల్లో (దేశాల్లో) ఒకటిగా మనదేశం మరింతగా ఎదుగుతుందని, అంతర్జాతీయ సూచీల్లో తన ర్యాంకింగ్‌ను మెరుగుపరచుకుంటుందని కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యాభివృద్ధి శాఖ (డీపీఐఐటీ) కార్యదర్శి రమేష్ అభిషేక్ మంగళవారం నాడిక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ఆశాభావం వ్యక్తం చేశా రు. ఇందుకు సంబంధించిన తాజా ర్యాంకింగ్ లు బుధవారం విడుదల కానున్న క్రమంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రస్తుతం ‘మోస్ట్ ఇన్నొవేటివ్ ఎకానమీస్’ సూచీలో మనదేశం 57వ స్థానంలో ఉంది. ఇప్పటికే సరళతర వాణిజ్యం వంటి అంశాలకు సం బంధించిన అంతర్జాతీయ సూచీల్లో మనదేశం వృద్ధిని సాధించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతర్జాతీయ పరిశోధనాత్మక ఆవిష్కరణల సూచీ (జీఐఐ) తాజా ర్యాం కింగ్‌లు బుధవారం విడుదలవుతాయని ఆయన చెప్పారు. కార్నెల్ విశ్వ విద్యాలయం, యూరోపియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్స్ (ఐఎన్‌ఎస్‌ఈడీ), ఐక్య రాజ్య సమితి ప్రపంచ మేథో సంపద నిర్వహణ సంస్థ (విప్రో), గిల్ నాలెడ్జ్ పార్ట్‌నర్స్ సంయుక్తంగా ప్రతిఏటా ప్రచురించేదే ఈ జీఐఐ సూచీ. ఈ సూచీ 2018లో మనదేశానికి 57వ ర్యాంకును కేటాయించింది. 2017లో వచ్చిన 60వ ర్యాంకుకంటే గడచిన ఏడాది స్వల్పంగా ర్యాంకు మెరుగుపడింది. 2016లో ఈ ర్యాంక్ 66, 2015లో 81గాను ఈ ర్యాంకు ఉండేది. ఐతే తాజాగా మనదేశం తొలి 25 ప్రముఖ దేశాల్లో ఒకటిగా ర్యాంకింగ్‌ను మెరుగుపరచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని రమేష్ అభిషేక్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా తక్కువ ధరలకే ఔషధాలు లభ్యమయ్యేందుకు అవకాశాలున్నా పేటెంట్ ఔషధాలు ఎందుకు అధిక ధరలు పలుకుతున్నాయన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి అనేక విభాగాలున్నాయని, అందులో జాతీయ ఔషధ ధరల సంస్థ, జాతీయ నిత్యావసర ఔషధాల జాబితాతోబాటు జనౌషదీ కేంద్రాల ప్రాముఖ్యత ఉందని తెలిపారు. కాగా మేథోసంపద హక్కులకు సంబంధించిన వాణిజ్య వ్యవహారాలను పర్యవేక్షించే ‘టీఆర్‌ఐపీఎస్’ ప్రపంచ వాణిజ్య సంస్థతో ఒడంబడిక చేసుకుంటుందని, ఈ సంస్ధ పేటెంట్ ఔషధాల ధరలు పెరిగినప్పుడు ఆ సమస్యను సరళతరం చేసే చర్యలు చేపడుతుందని ఆయన వివరించారు. ఈ ఒప్పందం ప్రకారం మనదేశం పేటెంట్ హక్కులున్న జనరిక్ ఔషధాల తయారీకి ‘నిర్బంధ లైసెన్స్’లను కేటాయిస్తుందన్నారు. ఈ విషయంలో పరిశ్రమల విభాగం సీఐఐ, జీఐఐతో 2009 నుంచి నాలెడ్జ్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికే ఈ దిశలో ప్రగతిపథంలో ఉన్నా మరింత వృద్ధిని సాకారం చేసుకునే దిశగా మనదేశం కృషి చేస్తోందన్నారు. ప్రత్యేకించి మేథోసంపద హక్కుల విభాగంలో మరింత ఉన్నతిని సాధించాలన్న లక్ష్యం ఉందన్నారు. కాగా జీఐఐలోని 80 సూచీల్లో మొత్తం 126 దేశాలున్నాయి. ప్రధానంగా మొబైల్ అప్లికేషన్ల సృష్టి, విద్యకోసం ఖర్చు, వైజ్ఞానిక, సాంకేతిక ప్రచురణల వంటి అంశాలను ఈ ర్యాంకింగ్ కోసం పరిగణనలోకి తీసుకుంటారు.