బిజినెస్

నిద్రలేమికి సరికొత్త మాత్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: నిద్రలేమితో బాధపడే వారికి చేసే వైద్య చికిత్సలో వినియోగించే జనరిక్ ఔషధ విలువలు కలిగిన సరికొత్త మాత్రలను ఔషధ దిగ్గజ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ మంగళవారం అమెరికన్ మార్కెట్లో విడుదల చేసింది. ‘ఎస్‌టీఆర్ 8 ఎంజెన్త్’ పేరిట రూపొందిన ఈ 8 ఎంజీ టాబ్లెట్లకు అమెరికా ఆహార, ఔషధ పరిపాలనా విభాగం (యూఎస్‌ఎఫ్‌డీఏ) ఆమోదం లభించిందని బీఎస్‌ఈ ఫైలింగ్‌లో రెడ్డీస్ ల్యాబ్స్ పేర్కొంది. టకేడా పార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన ‘రోజెరెమ్’ మాత్రల సంప్రదాయ (జనరిక్) వెర్షన్‌తో అదే సామర్థ్యంతో ఈ మాత్రలను తయారు చేయడం జరిగిందని తెలిపింది. రోజెరెమ్ బ్రాండ్ మాత్రలు ప్రతిఏటా అమెరికా 91.3 మిలియన్ డాలర్ల మేర విక్రయాలు జరుగుతున్నట్టు తెలిపింది. కాగా జనరిక్ 8 ఎంజీ రామెల్టియన్ మాత్రలు 30, 100, 1000 ప్యాక్‌ల్లో లభిస్తాయని కంపెనీ తెలిపింది. ఇలావుండగా రెడ్డీస్ ల్యాబోరేటరీస్ వాటాలు బీఎస్‌ఈలో మంగళవారం 1.21 శాతం నష్టాలతో ఒక్కోవాటా రూ. 2600 వంతున ట్రేడయ్యాయి.