బిజినెస్

రైల్వే ప్రయాణికుల నుంచి రెండేళ్లలో రూ. 46 కోట్ల ప్రీమియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: రైల్వే శాఖ, దాని ప్రయాణికుల నుంచి ‘జాతీయ రవాణా, పర్యాటక బీమా పథకం’ ద్వారా ప్రైవేటు బీమా సంస్థలు గత రెండేళ్ల కాలంలో రూ. 46 కోట్ల రూపాయలు పాలసీ ప్రీమియంల ద్వారా ఆర్జించాయి. ఐతే ఈ కాలంలో కేవలం ఏడు కోట్ల రూపాయలు మాత్రమే క్లెయిమ్‌ల ద్వారా ఆ కంపెనీలు బాధితులు లేదా వారి కుటుంబాలకు చెల్లించడం జరిగింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘భారతీయ రైల్వేల కేటరింగ్, పర్యాటక కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఓ పరిమిత టెండరింగ్ విధానంతో ఈ ఆఫ్షనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పథకం కోసం 2016 సెప్టెంబర్‌లో మూడు ప్రైవేటు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులోశ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌తోబాటు, ఐసీఐసీఐ లాంబర్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ విమిటెడ్ ఉన్నాయి. ఈ మేరకు రూ. 0.92 ప్రీమియంగా ప్రయాణికుల నుంచి ఆ బీమా కంపెనీలు వసూలు చేసే వెసులుబాటు కలిగింది. ఈ బీమా సదుపాయం అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్‌చేసుకుని టికెట్లు ఖరారైన లేదా ఆర్‌ఏసీలో ఉన్న ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది. ఒక వేళ రైలు ప్రయాణ సందర్భంగా జరిగే ప్రమాదాలు, లేదా దోపిడీలు, మరే ఇతర అనివార్య కారణాల ద్వారానైనా మృతిచెందడం, గాయపడిన సందర్భాల్లో క్లెయిమ్‌చేస్తే ఈ చెల్లింపులు జరుగుతాయి. గత ఏడాది ఆగస్టు 31తో ఆ కంపెనీలు బీమా సొమ్ము మొత్తాన్ని బాధిత ప్రయాణికుల ఖాతాల్లోకి బదలాయించాయి. ఈక్రమంలో గత అక్టోబర్‌లో ప్రీమియం మొత్తాన్ని ఐఆర్‌సీటీసీ రూ 0.40గా సవరించింది. కాగా ఐఆర్‌టీసీ ఇప్పటి వరకు ఆ మూడు ప్రైవేటు బీమా కంపెనీలకు మొత్తం రూ. 38.89 కోట్లు చెల్లించగా ప్రయాణికులకు గడచిన రెండేళ్ల కాలంలో రూ. 7.29 కోట్లు మాత్రమే చెల్లించడం జరిగిందని మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్‌కు సమాచార చట్టం (ఆర్టీఐ) ద్వారా అందిన గణాంకాల మేరకు తెలిసింది. సాధారణంగా రైలు ప్ర యాణికులు మరణించడం జరిగితే ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంది. అలాగే శాశ్విత అంగవైకల్యం కలిగితే రూ. 7.5 లక్షలు, సాధారణంగా గాయపడిన వారికి రూ. 2లక్షల వంతున అందుతుంది. ఇలావుండగా సం బంధిత ప్రైవేటు బీమా కంపెనీలకు గడచిన రెండేళ్లలో మొత్తం 206 క్లెయిమ్‌లు రాగా అందులో 72 వివిధ కారణాలు చూపి తిరస్కరించడం జరిగింది. అదేక్రమంలో 2013-14 నుంచి రైలు ప్ర మాదాల సంఖ్య కూడా తగ్గుతోంది. ఆ ఏడాది 118 ప్రమాదాలు దేశవ్యాప్తంగా జరుగగా, 2016-17లో 104కు, 2017-18లో 59కి తగ్గిపోయాయి. అలాగే ప్రస్తుత ఏడాది ఇప్పటి వరకు 19 ప్రమాదాలు జరిగాయని రైల్వే గణాంకాలు తెలిపాయి.