బిజినెస్

సత్యవేడు శ్రీసిటీలో తొహోకు స్టీల్ పరిశ్రమ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు, జూలై 19: చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలోని శ్రీసిటీలో జపాన్ దేశానికి చెందిన తొహోకు స్టీల్స్ కంపెనీ లిమిటెడ్ అనుబంధ తొహోకు స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన పరిశ్రమను శుక్రవారం ప్రారంభించారు. పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ హీరోకి యమడా, ప్రెసిడెంట్ షింజీ నరుసే, వైస్ ప్రెసిడెంట్ షుఖషా నషీమురోలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్ రమేష్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మెనేజింగ్ డైరెక్టర్ హీరోకి యమడా మాట్లాడుతూ శ్రీసిటీ పలు వ్యాపారాలకు అనుకూలంగా ఉన్నందున తమ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించామన్నారు. గత 40ఏళ్లుగా భారతదేశంలోని తమ వినియోగదారులకు జపాన్‌లోని పరిశ్రమల్లో తయారైన ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామని, ఇకపై శ్రీసిటీ ప్లాంట్ ద్వారా దేశీయంగా పెరుగుతున్న గిరాకీకి దీటుగా సరఫరా చేస్తామన్నారు. సుమారు ఆరుఎకరాల స్థలంలో 80వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈ ప్లాంట్ నిర్మించామన్నారు. ఆటోమొబైల్ ఇంజన్ వాల్వ్‌లు, ఆటోమొబైల్ ఫ్యూయల్ ఇంజెక్టర్‌ల అవసరమైన ఉక్కు కడ్డీలు, సాఫ్ట్ మాగ్నటిక్ స్టెయిన్‌లెస్ స్టీల్ కడ్డీలను ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తామన్నారు. అత్యంత ఆధునాతన విధానం ద్వారా ఏర్పాటుచేసిన ఈ ప్లాంట్‌లో సుమారు 50మందికి ఉపాధి కల్పిస్తామన్నారు.