బిజినెస్

విదేశీయులను అకట్టుకుంటున్న మన దేశ ఉద్యోగావకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: విదేశీ వలసదారులకు చక్కటి ఉపాధినిచ్చే గమ్యస్థానంగా మనదేశం ఎదుగుతోంది. ఈ విషయంలో దేశ ఖ్యాతికూడా ఖండాంతరాలకు విస్తరిస్తోంది. ప్రత్యేకించి నిపుణతకు అనుగుణంగా కెరీర్‌ను మలుచుకునేందుకు, తదనుగుణంగా వేతనాల లభ్యతకు సైతం మన దేశం అనువుగా ఉందని ‘హాంగ్‌కాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ (హెచ్‌ఎస్‌బీసీ) అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. మొత్తం 163 మార్కెట్లకు చెందిన 18,059 మంది వలసదారులను, సుమారు 48 శాతం విదేశీ ఉద్యోగులు, వృత్తిదార్లను ఈ అధ్యయనం సందర్భంగా సంప్రదించినట్టు హెచ్‌ఎస్‌బీసీ నిర్వాహకులు తెలిపారు. భారత్‌లో పనిచేయడం వల్ల కావలసిన ప్రయోజనాలు పూర్తి స్థాయిలో పొందగలిగామని వారంతా సంతృప్తిని వ్యక్తం చేసినట్టు నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో ఇలా ఇష్టపడేవారి నిష్పత్తి 42 శాతం ఉండగా మనదేశంలో పనిచేసేందుకు, వాణిజ్యాన్ని తరలించేందుకు ఇష్టపడే వారి సంఖ్య 48 శాతంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఉద్యోగపరంగా భారత్‌కు వచ్చిన తర్వాత తమకు వేగంగా ప్రమోషన్లు లభించాయని 29 శాతం మంది వెల్లడించారు. ఈ దేశంలో కొత్తగా వృత్తినిపుణతను పెంచుకునేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని 58 శాతం మంది వ్యక్తం చేశారు. భారత్‌కు తరలివచ్చాక తమ వ్యక్తిగత ఆదాయం 24 శాతం పెరిగిందని అంతర్జాతీయ వృత్తి నిపుణులు వెల్లడించారు. అలాగే రూ. 69 లక్షల వరకు వార్షికాదాయాన్ని భారత్‌కు తరలివచ్చిన తర్వాత పొందగలిగామని 32 శాతం మంది ఉన్నతోద్యోగులు తెలిపారు. అంటే ఇది అంతర్జాతీయంగా ఉన్న కనీస స్థాయి 18 శాతం కంటే అధికమని నివేదిక తెలిపింది. అలాగే తమ దేశాలకంటే భారత్ నుంచి తమ దేశాలకు పంపించగలిగేంత అధిక ఆదాయం లభిస్తోంది, ప్రత్యేకించి ఇక్కడ తక్కువ ఖర్చుతో జీవించగలిగే వీలుందని 49 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇలావుండగా పెద్ద స్థాయిలో అనుభవం గడించిన ఈ దేశానికి చెందిన ఉద్యోగులు తమ కెరీర్‌ను మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు విదేశాలకు తరలివెళుతున్నారని ఆ నివేదిక పేర్కొంది. ప్రధానంగా ఆర్థిక, సేవా రంగాలనుంచి 24 శాతం మంది, ఆరోగ్య రంగం నుంచి 11 శాతం మంది, ఇంజనీరింగ్, డిజైన్, ఆర్కెటెక్చర్ రంగాల నుంచి 11 శాతం మంది వృత్తినిపుణులు విదేశాలకు తరలివెళుతున్నారని ఆ అధ్యయనం తేల్చింది. బ్రిటన్, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారత వృత్తి నిపుణులకు ప్రఖ్యాత గమ్యస్థాన దేశాలుగా ఉన్నాయని వెల్లడించింది. ఇలా తరలివెళ్లేందుకు ప్రధాన కారణం కెరీర్‌ను వృద్ధిచేసుకోవాలనుకోవడంతోబాటు, విలాసవంతమైన జీవితాలకు అనుగుణంగా ఆదాయ మార్గాలు పెంచుకోవాలన్న ఆలోచనే అని ఆ నివేదిక తెలిపింది. దీర్ఘకాలిక ధనార్జన లక్ష్యాలను సాధించి తమ సంతానానికి మంచి భవిష్యత్తునివ్వాలనే ధ్యేయంతోనే ఇలా విదేశీబాట పట్టామని అధిక శాతం మంది అభిప్రాయపడ్డారని హెచ్‌ఎస్‌బీసీ ఇండియా రీటెయిల్ బ్యాంకింగ్ అండ్ వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగాధిపతి రామకృష్ణన్ తెలిపారు. ఐతే ఇప్పుడు భారత్‌లో మారిన కెరీర్ అభివృద్ధికి సంబంధించిన పరిస్థితులు విదేశీయులను ఆకట్టుకుంటున్నాయన్నారు. ప్రస్తుతం భారత్‌కు చెందిన 18 మిలియన్ల మంది వృత్తి నిపుణులు విదేశాల్లో స్థిరపడ్డారని నివేదిక వెల్లడించింది.