బిజినెస్

యూఏఈ ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొదిస్తున్న భారత విద్యార్థి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మే 23: అరబ్ ఎమిరేట్స్‌లో భారత సంతతికి చెందిన ఓ విద్యార్థి విరాళాలు సేకరించి తన ఇంట్లోనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి అందరి ప్రశంసలందుకుంటున్నాడు. నిరంతరం వీడియోగేమ్‌ల వంటి ప్రాపకాలతో కాలం వెళ్లదీసే అక్కడి యువతలోగ్రంథ పఠనం మీద ఆసక్తిని పాదుకొల్పేందుకు షార్జాకు చెందిన ఈ తొమ్మిదేళ్ల విద్యార్థి కాశీనాథ్ ప్రాణేష్ కృషి చేస్తున్నాడు. ఇప్పటికే ఈబాలుడు అక్కడి ప్రజల్లో ప్రపంచ జ్ఞానాన్ని పెంచేందుకు తనవంతుగా పలు విద్య, దాతృత్వ కార్యక్రమాలను నిర్వహించి మన్ననలందుకుంటున్నాడు. గత ఏడాది కేరళలో సంభవించిన వరదల్లో బాధితులైన వారికి తన వంతు ఆర్థిక సాయం అందజేశాడు. స్పెల్లింగ్ బీ కార్యక్రమంలో సైతం విజేతగా నిలిచాడు. రెండు వారాల క్రితం ‘గౌరవప్రద విద్యార్థి’ అవార్డును హమ్‌డాన్ పౌండేషన్ నుంచి అందుకున్నాడు. అలాగే ఇతను పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించే గ్రీన్ గ్రూప్‌లో సైతం సభ్యుడు. ఈ విద్యార్థి కృషిని కాంగ్రెస్ నేత శశిథరూర్ అభినందించారు. ‘2016వ సంవత్సరాన్ని చదువుల సంవత్సరంగా యూఏ ఈ ప్రకటించిన నేపథ్యంలో చదువుకు ఉన్న ప్రాథాన్యతను చాటాలని నిర్ణయించి ‘బుక్ డ్రైవ్స్’, ‘చారిటీస్ డ్రైవ్’ ద్వారా పుస్తకాలను సేకరించి ఇంట్లోనే చిన్న గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశానని కాశీనాథ్ ప్రాణేష్ తెలిపారు.