బిజినెస్

మిలియన్ మార్క్ దాటిన మహీంద్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా (ఆటోమోటివ్ డివిజన్) వాహనాల కంపెనీ 10 లక్షల (1 మిలియన్) వాహనాలను ఉత్పత్తిచేసి అరుదైన రికార్డును నెలకొల్పింది. ఈ నెల గత 23వ తేదీ నాడు 10 లక్షల వాహనాల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ సందర్భంగా మంగళవారం కర్మాగారంలో కార్మికులు మిలియనోత్సవ సంబరాలు జరుపుకొన్నారు. 1985లో స్థాపించిన కర్మాగారం 2005లో లక్ష వాహనాలను ఉత్పత్తిచేసి కార్మికుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. జహీరాబాద్ ఆటోమోటివ్ చరిత్రలోనే ఓ గొప్ప మైలురాయిని కర్మాగారం అధిగమించింది. చరిత్రలో తనదైన రికార్డును నెలకోల్పింది. 2018లో 9లక్షల మైలురాయిని దాటిన కర్మాగారం సంవత్సరంలోపే 1 మిలియన్ వాహనాల ఉత్పత్తి మైలురాయిని అలవోకగా అధిగమించింది. ఇలా అనేక మోటార్లను స్థానిక కర్మాగారంలో కార్మికులు ఆవిష్కరించారు. విజయోత్సవంలో పాల్గొన్న కర్మాగారం అధ్యక్షులు రాజన్ వధేరా మాట్లాడుతూ మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారం 1 మిలియన్ వాహనాల ఉత్పత్లి లక్ష్యాన్ని అధిగమించడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏటా 7.5 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. కార్మికుడు చేస్తున్న కృషి కొనియాడారు. మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ మరో వాహనం జీతో ఉత్పత్తులు లక్షకు చేరాయన్నారు. లక్ష ఉత్పత్తిని సాధించడంలో కార్మికులు, అధికారుల శ్రమ ఎనలేనిదన్నారు. క్రమశిక్షణతో నిరంతరం సమావేశాలు, చర్చలతో అధికోత్తపత్తి సాధ్యమన్నారు. ఇతర కర్మాగారాలకంటే తమ ఉత్పత్తులు ఎంతో మేలురకమైనందునే ఉత్పత్తి రికార్డులు సొంతమవుతున్నాయన్నారు. మహీంద్రా సాధించిన అనేక రికార్డులు కార్మికులకే సొంతమన్నారు. వారు కర్మాగారం అభివృద్ధికోసం వారు శ్రమిస్తున్న తీరు అభినందనీయమన్నారు. మహీంద్రా కర్మాగారం యాజమాన్యం అందిస్తున్న తోడ్పాటుతో కార్మికులు శ్రమ తోడవడంతోనే దేశంలోనే అత్యంత మెరుగైన ఫలితాలు సాధిస్తుందన్నారు. ఇందుకు కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

చిత్రం...లక్ష్యం పూర్తిచేసిన వాహనంతో కర్మాగారం అధికారులు, కార్మికులు