బిజినెస్

స్నేహపూర్వక ప్రాంతాలకు వెళ్లేందుకే భారత పర్యాటకుల ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 23: పర్యావరణ పరంగా ఆహ్లాదభరితమైన, పచ్చదనంతో కూడుకున్న ప్రదేశాలకు వెళ్లి ఎక్కువ కాలం స్థిర నివాసం ఉండాలని, విభిన్న సంస్కృతుల ప్రజలతో మమేకం కావాలన్న కోరికను మన దేశానికి చెందిన అధిక శాతం పర్యాటకులు వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరానికి ఓ మారైనా అలాంటి అనుభవాన్ని అస్వాదించాలన్న జిజ్ఞాస దాదాపు 98 శాతం భారతీయ పర్యాటకుల్లో ఉంది. ఒకవేళ అక్కడే ఉండలేకపోయినా పర్యావరణ స్నేహపూర్వక ప్రాంతాల్లో స్థిరమైన బస ఏర్పాట్లు చేసుకోవడానికి 90 శాతం మంది ఆసక్తిని కనబరిచారని అంతర్జాతీయ ఈ కామర్స్ కంపెనీ ‘బుకింగ్ డాట్ కామ్’ నిర్వహించిన అధ్యయన నివేదిక ‘సస్టయినబుల్ ట్రావెల్ రిపోర్ట్’ వెల్లడించింది. ఈ కంపెనీ ఇలా అధ్యనం చేయడం వరుసగా ఇది నాలుగో సంవత్సరం. పర్యాకుల్లో 2016లో 62 శాతం, 2017లో 65 శాతం, 2018లో 68 శాతం వంతున ఈ సంస్థ అభిప్రాయ సేకరణ చేసింది.
గత 12 నెలల కాలంగా వివిధ దేశాలు, ప్రాంతాలకు వెళ్లొచ్చిన, రాబోయే 12 నెలల కాలంలో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్న 18,077 మంది పర్యాటకులను ఈ సదర్భంగా ఈ ప్రతినిధులు కలుసుకోవడం జరిగింది. ప్రధానంగా బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్పెయిన్, తైవాన్, బ్రిటన్, అమెరికా వంటి మొత్తం 18 దేశాల పర్యాటకులు ఇందులో ఉన్నారు. పర్యావరణ సేహపూర్వక పర్యటనలు కోరుతున్నవారి సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా అలాంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా బుకింగ్ డాట్ కామ్ భారత, శ్రీలంక, మాల్దీవ్‌ల విభాగం మేనేజర్ రితు మల్హోత్రా అభిప్రాయపడ్డారు. ఇలాంటి వారికి ప్రధానంగా 51 శాతం పన్ను మినహాయింపువంటి ప్రోత్సాహకాలను అందజేయవచ్చన్నారు. ప్రధానంగా ఆన్‌లైన్ బుకింగ్ సైట్లు ఈ రకమైన ఆఫర్లను ఇస్తున్నాయన్నారు. పర్యటనలకు వెళ్లిన చోట తమ దైనందిన కార్యక్రమాలకు ఆటంకం కలుగకుండా ఉండాలని భారతీయ పర్యాటకులు కోరుతున్నారు. ముఖ్యంగా వాకింగ్, బైక్ రైడింగ్, హైకింగ్ వంటివి చేయాలని భావిస్తున్నారని, అలాగే వెళ్లిన చోట ప్రజల సంస్కృతికి సంబంధించిన సాధికార ఆస్వాదనను 80 శాతం మంది కోరుతున్నారని తెలిపారు.