బిజినెస్

న్యాయ ఫీజులతో నిధులు వృథా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఏప్రిల్ 19: భారతీయులు పన్నుల ద్వారా చెల్లిస్తున్న సొమ్మును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంగ్లాండ్‌లో కోర్టు ఫీజుల కోసం వృథా చేస్తోందని లండన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా శుక్రవారం నాడిక్కడ వ్యాఖ్యానించారు. ఈమేరకు మరోమారు ఆయన సామాజిక మాధ్యమం ఆధార్యంగా విమర్శనాస్త్రాలను సంధించారు. తాను బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం తిరిగి చెల్లిస్తామని చెబుతున్నా ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. తన లండన్ బ్యాంకు ఖాతాల నుంచి 260,000 పౌండ్ల మొత్తాన్ని ఫ్రీజ్ చేయడం ఆపాలంటూ మాల్యా చేసిన విజ్ఞప్తిని ఇక్కడి హైకోర్టు తోసిపుచ్చడంతో 63 సంవత్సరాల మాల్యా ట్విట్టర్‌లో విమర్శలు చేయడం ఆరంభించారు. ఈ క్రమంలో ఆయన తాజాగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సార్టియంపై విమర్శల దాడి చేశారు. ఇంగ్లాండ్ న్యాయ స్థానాల్లో తన విషయంలో ఎస్‌బీఐ కన్సార్టియం అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నాడు. ఇక్కడి ఎస్‌బీఐ న్యాయవాదులు వారి వ్యక్తిగత అభిప్రాయాల మేరకు నడుచుకుంటున్నారన్నారు. ఈ విషయంలో భారత దేశ ప్రజాధనం వృథా అవుతోందన్నారు. తన రుణాల పూర్తి రికవరీకి ప్రధానమంత్రి సైతం సుముఖంగా ఉన్నా బ్యాంకుల కన్సార్టియం ఎందుకు పెడచెవిన పెడుతోందో తెలియడం లేదని ట్వీటారు. గత మేనెలలో బ్యాంకుల కన్సార్టియంకు చెందిన న్యాయ విభాగం 1.142 బిలియన్ పౌండ్లను ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీజ్ చేయాలన్న తీర్పుతో విజయం సాధించామన్న భ్రమల్లో ఉన్నాయని, భారతీయుల ధనంతో ఎస్‌బీఐ లాయర్లు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని, దీనిపై ఆ కన్సార్టియం సమాధానం చెప్పితీరాల్సిందేనని ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. మీడియా కూడా ఈ విషయంలో ఎందుకు ఉదాశీనంగా వ్యవహరిస్తోందని, ప్రజాధనం వృథాపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలెందుకు సేకరించడం లేదని మాల్యా ప్రశ్నించారు.